తప్పుకున్న సెరెనా: క్వార్టర్ ఫైనల్ కు షరపోవా

Serena Willaims out of French open
Highlights

 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగం నుంచి స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ తప్పుకుంది.

పారిస్‌: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగం నుంచి స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ తప్పుకుంది. నాలుగో రౌండ్‌లో భాగంగా అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌, రష్యా స్టార్‌ మారియా షరపోవాల మధ్యజరగాల్సిన మ్యాచ్ జరగలేదు. దాంతో షరపోవా క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది. 

సెరెనా భుజానికి సంబంధించిన కండరాల గాయంతో  మ్యాచ్‌ నుంచి తప్పుకుంది. క్వార్టర్‌ ఫైనల్లో రష్యా స్టార్‌ ముగురుజ (స్పెయిన్‌), లెసియా సురెంకో (ఉక్రెయిన్)ల్లో తలపడాల్సి ఉంటుంది.

దురదృష్టవశాత్తు భుజ కండరాల గాయంతో టోర్నీ నుంచి తప్పుకుంటున్నానని, ఈ స్థితిలో తాను ఆడలేనని, ఇది చాలా కష్టంగా ఉందని అన్నారు. మారియాతో పోటీని తాను ఎల్లవేళలా ఇష్టపడుతానని, ఇలా జరుగుతుందని అనుకోలేదని అన్నారు. 
చాలా బాధేస్తుందని అన్నారు. త కూతురికి, కుటుంబానికి దూరంగా ఉంటూ సాధన చేశానని, ఈ పరిస్థితి చాలా కఠినంగా ఉందని సెరెనా అన్నారు.

loader