చేసింది తప్పని ఒప్పుకున్నా... పశ్చాత్తాపడుతూ క్షమాపణలు చెప్పినా.. పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్‌పై అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణా మండలి (ఐసీసీ) కనికరించలేదు. ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా సాటి క్రికెటర్‌ను జాతి వివక్షతతో కూడిన వ్యాఖ్యలతో దూషించినందుకు గాను సర్ఫరాజ్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని విధించింది.
చేసింది తప్పని ఒప్పుకున్నా... పశ్చాత్తాపడుతూ క్షమాపణలు చెప్పినా.. పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్‌పై అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణా మండలి (ఐసీసీ) కనికరించలేదు.
ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా సాటి క్రికెటర్‌ను జాతి వివక్షతతో కూడిన వ్యాఖ్యలతో దూషించినందుకు గాను సర్ఫరాజ్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని విధించింది. డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో బ్యాటింగ్ చేస్తోన్న ప్రోటీజ్ ఆల్‌రౌండర్ ఆండిల్ పెహ్లువాకియా నలుపు రంగును ఉద్దేశిస్తూ కీపర్‌గా ఉన్న సర్ఫరాజ్ జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు.
‘‘ఏయ్ నల్లోడా.. మీ అమ్మ ఎక్కడ కూర్చుంది.. నీకు ఏం కావాలని ఆమెను ప్రార్థించమన్నావ్ ’’ అంటూ ఉర్దూలో మాట్లాడిన మాటలు స్టంప్స్ మైక్‌లో రికార్డయ్యాయి. దీనిపై క్రికెట్ ప్రపంచంతో పాటు వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న పలు సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
చేసిన తప్పును ఒప్పుకున్న పాక్ కెప్టెన్ ఆ తర్వాతి రోజు క్షమాపణలు కోరాడు. ‘‘తాను ఉద్దేశ్యపూర్వకంగా ఆ మాటలు అనలేదని, ఎవరినీ బాధపెట్టే ఉద్దేశ్యం తనకు లేదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహచర క్రికెటర్లను తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానన్నాడు. తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే మన్నించండి అంటూ ట్వీట్ చేశాడు.
అయితే జరిగిన సంఘటనపై దక్షిణాఫ్రికా జట్టు కానీ, బోర్డు కానీ ఫిర్యాదు చేయకపోయినప్పటికీ ఐసీసీ మాత్రం స్వతంత్ర విచారణ చేపట్టింది. నిబంధనావళి ప్రకారం... మైదానంలో ఆటగాళ్లను, వారి కుటుంబాన్ని కించపరచడం, దూషించడం నేరం.
దీని ప్రకారం సర్ఫరాజ్‌పై రెండు వన్డేలు, రెండు టీ20లపై నిషేధం విధించింది. అయితే స్లెడ్జింగ్ కాకుండా ఇవి జాతి వివక్ష వ్యాఖ్యలుగా తేలితే మాత్రం సర్పరాజ్‌కు పెద్ద శిక్షే పడవచ్చని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
‘‘మేం క్షమించాం.. కానీ’’: సర్ఫరాజ్ వ్యాఖ్యలపై డుప్లిసెస్ కామెంట్స్
‘‘ఏయ్ నల్లోడా.. మీ అమ్మ’’ అంటూ పాక్ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 27, 2019, 3:15 PM IST