నా భార్య సానియాను ఆ అంతర్జాతీయ క్రికెటర్ వేధించాడు : షోయబ్ మాలిక్

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 4, Sep 2018, 3:19 PM IST
Sania Mirza eve-teased by Bangladesh cricketer Sabbir Rahman
Highlights

భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై ఓ బంగ్లాదేశీ క్రికెటర్ వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనతో కలిసి బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన సానియాను ఓ బంగ్లా క్రికెటర్ వేధించినట్లు స్వయంగా షోయబ్ మాలిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. 
 
బంగ్లాదేశ్ మీడియా  కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నాలుగేళ్ల క్రితం నిర్వహించిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో పాల్గొనడానికి పాకిస్థాని క్రికెటర్ షోయబ్ మాలిక్ వెళ్లాడు. అతడితో పాటు భార్య సానియా మీర్జాను కూడా తీసుకెళ్లాడు. అయితే ఓ మ్యాచ్ సందర్భంగా గ్రౌండ్ కు వెళ్లిన సానియాను బంగ్లా క్రికెటర్ షబ్బీర్ రహమాన్ అవమానకర వ్యాఖ్యలు చేశాడు. దీంతో షోయబ్ మాలిక్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు కూడా ఫిర్యాదు చేశాడు.

అయితే షబ్బీర్ రహమాన్ క్రికెటర్ గా కంటే వివాదాస్పద క్రికెటర్ గానే బంగ్లా ప్రజలకు సుపరిచితం. సానియా వేధింపుల తర్వాత ఇతడు ఓ అభిమానిపై దాడి చేసి మరో వివాదానికి తెరతీశాడు. తాజాగా సోషల్ మీడియాలో ఓ అభిమానికి దూషించడంతో అతడిపై బంగ్లా క్రికెట్ బోర్డు ఆరు నెలల నిషేదం విధించింది. దీంతో అతడు ఆసియా కప్ తో పాటు దేశీయ క్రికెట్ కు కూడా దూరం కానున్నాడు. 
 
loader