క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ లకు బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. రెండు పదవుల్లో కొనసాగడాన్ని వ్యతిరేకిస్తూ.. ఇటీవల గంగూలీకి అంబుడ్స్ మన్ కమిటీ నోటీలు జారీ చేసిన సంగతి  తెలిసిందే. తాజాగా.. సచిన్ , లక్ష్మణ్ లకు అంబుడ్స్ మన్, ఎథిక్స్ అధికారి డీకే జైన్ నోటీసులు జారీ చేశారు.

ఐపీఎల్ ప్రాంఛైజీలైన ముంబయి ఇండియన్స్ లో సచిన్ టెండుల్కర్, సన్ రైజర్స్ లో వీవీఎస్ లక్ష్మణ్ లు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నోటీసులపై వీరిద్దరూ లిఖిత పూర్వక వివరణ ఈ నెల 28వ తేదీలోగా బోర్డుకు అందించాల్సిందిగా అధికారులు లేఖలో పేర్కొన్నారు. 

రెండు పదువుల వ్యవహారంలో సుప్రీంకోర్టులో మధ్య ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కి చెందిన సంజీవ్ గుప్తా పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. సచిన్, లక్ష్మణ్ లు క్రికెట్ అడ్వైజరీ కమిటీలో ఉంటూనే.. ఐపీఎల్ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నోటీసులు వారికి అందాయి.