టీం ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ... బుధవారం విశాఖ వేధికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో విజృంభించాడు. ఓపెనర్  తొలిసారి సుదీర్ఘ మ్యాచ్  ఆడిన రోహిత్ సెంచరీతో అజేయంగా నిలిచాడు. కాగా... రోహిత్ ఆట చాలా మందికి సెహ్వాగ్ ని గుర్తు చేసింది. కాగా... రోహిత్ ని సెహ్వాగ్ తో పోల్చడంపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ స్పందించాడు.

సెహ్వాగ్ లాగా దూకుడుగా అందరూ ఆడతారని...కానీ అతనిలా నిలకడగా కూడా రాణించాలని పేర్కొన్నాడు.  టెస్టు మ్యాచుల్లో ఆడాలంటే భిన్నంగా ఆలోచించాలని సచిన్ పేర్కొన్నాడు. సెహ్వాగ్ ఆలోచన విధానంగా భిన్నంగా ఉంటుందని చెప్పాడు.  వన్డే అయినా, టెస్టు మ్యాచ్ అయినా సెహ్వాగ్ ఒకేలా ఆడతాడని చెప్పాడు. ఓపెనర్ గా సెహ్వాగ్ తన కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నిర్వహించేవాడని చెప్పాడు. టెస్టుల్లో రోహిత్ శర్మ ఓపెనర్ గా ఎలా రాణిస్తాడో చూడాలని అన్నాడు.

ఇంగ్లాండ్ లో ఓపెనర్ గా ఆడిన తొలి మ్యాచ్ లోనే సెహ్వాగ్ శతకం బాదాడని గుర్తు చేశారు.ఇది సెహ్వాగ్ కెరిర్ కి ఎంతగానో ఉపయోగపడిందని చెప్పాడు. కానీ సెహ్వాగ్ తర్వాత కొన్ని కఠిన పరిస్థితులను కూడా ఎదుర్కొన్నాడని సచిన్ పేర్కొన్నాడు.