మాస్టర్‌ బ్లాస్టర్‌ @ 45 (వీడియో)

Sachin Tendulkar is celebrating is 45th birthday
Highlights

సచిన్‌ అంటే ఓ బ్రాండ్‌ అనే స్థాయికి ఎదిగిపోయారు మాస్టర్‌ బ్లాస్టర్‌.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇవాళ 45వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. టెస్టులు, వన్డేల్లో అత్యధిక రన్స్ సాధించిన క్రికెటర్‌గా సచిన్ రికార్డుల్లో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ మొత్తం 34,357 రన్స్ చేశాడు. అంతేకాదు తన బౌలింగ్‌లోనూ 200 వికెట్లు తీసుకున్నాడు. క్రికెట్ ప్రేమికుల్ని ఎంతో అలరించిన సచిన్‌కు తన ట్విట్టర్‌లో అంతర్జాతీయ క్రికెట్ మండలి బర్త్‌డే విషెస్ చెప్పింది. కెరీర్‌ తొలినాళ్లలో ఒడిదుడుకులకు గురైన సచిన్‌.. మెల్లగా నిలదొక్కుకుని క్రికెట్‌లో డాన్‌ బ్రాడ్‌మన్‌ స్థాయికి చేరుకున్నారు. ముంబై నుంచి మొదలైన సచిన్‌ ప్రస్థానం ఖండాలను దాటుతూ ఆయా దేశాల ప్రధానులు, రాజులు, అధ్యక్షులు మెచ్చుకునే వరకూ వెళ్లింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన 25 సంవత్సరాల్లో సచిన్‌ అంటే ఓ బ్రాండ్‌ అనే స్థాయికి ఎదిగిపోయారు మాస్టర్‌ బ్లాస్టర్‌.

 

loader