Asianet News Telugu

రోహిత్ శర్మ కూతురు ''సమైరా'' క్యూట్ వీడియో... సోషల్ మీడియాలో వైరల్

టీంఇండియా డాషింగ్ బ్యాట్‌మెన్ రోహిత్ శర్మ చిన్నారి కూతురు ముద్దులొలికే వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రోహిత్ భార్య రితికా సర్దేశాయ్ తన ఇన్స్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ''సమైరా'' ముద్దుముద్దుగా నవ్వుతున్న వీడియోను పోస్ట్ చేశారు. దీంతో రోహిత్ అభిమానులే కాదు యావత్ క్రికెట్ ప్రియులు ఈ చిన్నారిపై తమ కామెంట్ల రూపంలో ప్రేమను కురిపిస్తున్నారు. 
 

Rohit Sharma's Daughter Samaira's Cute Smile  video
Author
Mumbai, First Published Feb 12, 2019, 2:02 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టీంఇండియా డాషింగ్ బ్యాట్‌మెన్ రోహిత్ శర్మ చిన్నారి కూతురు ముద్దులొలికే వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రోహిత్ భార్య రితికా సర్దేశాయ్ తన ఇన్స్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ''సమైరా'' ముద్దుముద్దుగా నవ్వుతున్న వీడియోను పోస్ట్ చేశారు. దీంతో రోహిత్ అభిమానులే కాదు యావత్ క్రికెట్ ప్రియులు ఈ చిన్నారిపై తమ కామెంట్ల రూపంలో ప్రేమను కురిపిస్తున్నారు. 

రోహిత్ అభిమానులు ఈ పాప క్యూట్ స్మైల్ ను చూసి పిధా అవుతున్నారు. మరికొందరేమో పాప అచ్చు తండ్రి రోహిత్ లాగే వుందంటూ పోలుస్తూ కామెంట్ చేస్తున్నారు. ఇలా ఈ వీడియోపై వివిధ రకాలుగా కామెంట్ చేస్తూ నెటిజన్లు షేర్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.    

 రోహిత్ శర్మ 2015లో తన చిన్ననాటి స్నేహితురాలు రితిక ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు 2018 డిసెంబర్ 30న ఓ ఆడపిల్ల జన్మించింది. ఈ సమయంలో ఆస్ట్రేలియా పర్యటనలో వున్న రోహిత్ హుటాహుటిన  భారత్‌కు పయనమయ్యాడు. 

అనేక సందర్భాల్లో తన ముద్దుల కూతురి గురించిన విశేషాలను సోషల్ మీడియా ద్వారా రోహిత్ పంచుకున్నాడు. కూతురి పేరును రోహిత్ సోషల్‌మీడియా ద్వారానే అభిమానులకు తెలియజేశాడు. తన భార్య కుమార్తెని ఎత్తుకున్న ఫోటోని షేర్ చేసిన రోహిత్...ఆ అమ్మాయికి ‘సమైరా’అని పేరు పెట్టినట్లు వెల్లడించాడు.

అయితే ఈసారి రోహిత్ భార్య రితిక ఆ పని చేసింది. తన కూతురి ముద్దులొలుకుతూ నవ్వుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆనందాన్ని నెటిజన్లతో పంచుకున్నారు.

వీడియో 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

😍🥰❤️

A post shared by Ritika Sajdeh (@ritssajdeh) on Feb 11, 2019 at 10:44pm PST


 

Follow Us:
Download App:
  • android
  • ios