టీం ఇండియాయువ క్రికెటర్, ఢిల్లా క్యాపిటల్స్ క్రికెటర్ రిషబ్ పంత్ మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడ్డాడా...? ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో ఈ చర్చ హాట్ టాపిక్ గా మారింది. పంత్ ఫిక్సింగ్ పాల్పడ్డాడనే అనుమానం కలిగించే వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

ఇంతకీ మ్యాటరేంటంటే.. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే.. ఈ మ్యాచ్ లో వికెట్ల వెనుక నిలబడి ఉన్న పంత్.. బాల్ వేయకముందే దాని ఫలితాన్ని చెప్పేశాడు. ఈ బాల్ కచ్చితంగా ఫోర్ వెళ్తుందని అన్నాడు. అతను అన్నట్లుగానే.. సందీప్ లామిచాన్ వేసిన బాల్ ని  రాబిన్ ఉతప్ప బౌండరీ దాటించాడు. ఫోర్ వాళ్ల స్కోర్ లోకి యాడ్ అయ్యింది.

పంత్ అన్న కామెంట్స్ స్టంప్ మైక్ లో స్పష్టంగా వినిపించాయి. దానికి సంబంధించిన వీడియోని ప్రస్తుతం తొలగించారు. కానీ అప్పటికే చాలా మంది నెటిజన్లు ఆ వీడియోపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా పంత్ పై కామెంట్స్ చేస్తున్నారు.

‘మూడో ఓవర్‌ ఐదో బంతికి.. కచ్చితంగా నాలుగు పరుగులు వస్తాయని పంత్‌ ముందే ఎలా చెప్పాడు. అతడి మాటలు వింటుంటే ఇది కచ్చితంగా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అని అర్థమవుతోంది. కామెంటేటర్లు పంత్‌ మాటలు అస్సలు పట్టించుకోలేదు’ అని ఓ నెటిజన్‌ మండిపడగా... ‘ అసలు ఐపీఎల్‌ అంటేనే మ్యాచ్‌ ఫిక్సింగ్‌.. ఇప్పుడు ఈ లీగ్‌లో లైవ్‌ ఫిక్సింగ్‌ జరుగుతోందని పంత్‌ మాటల ద్వారా తెలుస్తోంది. పంత్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి ఢిల్లీ విజయాన్ని ఆపాలని చూసినా అక్కడ పృథ్వీ షా ఉన్నాడు’ అంటూ మరొకరు విమర్శించారు