ఇండియన్ ప్రీమియర్ లీగ్...ఈ పేరు వింటే చాలు భారత క్రికెట్ అభిమానుల్లో ఓ నయా జోష్ వస్తుంది. ఈ టోర్నీ సమయంలో భారత క్రికెట్ అభిమానులు రాష్ట్రాల వారిగా విడిపోతారు. ఇలా దాదాపు రెండు నెలల పాటు దేశీయంగా జరిగే క్రికెట్ మజాను అనుభవిస్తారు. అయితే కేవలం ఐపిఎల్ లో కేవలం ఆటగాళ్ల మధ్యే కాదు ప్రాంఛైజీల మధ్య కూడా గట్టి పోటీ నెలకొని వుంటుంది. 

తాజాగా ఐపిఎల్ సీజన్ 12 షెడ్యూల్ విడుదలయ్యింది. దీంతో ఐపిఎల్ జట్లు, ప్రాంచైజీలు యాక్టివ్ గా మారాయి. ఐపిఎల్ సీజన్ 12 ఆరంభ మ్యాచ్   విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఎంఎస్.ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్  మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ట్విట్టర్ వేధికగా సరదా ట్వీట్ల యుద్దం జరుగుతోంది. 

మొదట చెన్నై జట్టును రెచ్చగొడుతూ ఆర్సీబి ఈ విధంగా ట్వీట్ చేసింది. '' తమకు స్టార్టర్ గా సౌత్ ఇండియాకు చెందిన మసాలా సాంబార్ దొరికింది. కానీ తాము స్వీట్ సాంబార్ ను ఇష్టపడతాం'' అంటూ ట్వీట్ చేసింది. 

ఈ ట్వీట్ కు సీఎస్‌కే కూడా అంతే దీటుగా జవాభిచ్చింది. '' సాంబార్ ఎక్కడైనా పసుపు రంగులోనే వుంటుంది...''అంటూ తమ జట్టు జెర్సీ రంగును పేర్కొంటూ ఆర్సీబికి   కౌంటరిచ్చింది. 

ఇరు జట్లు ఒకరిపై ఒకరు సరదాగా సాగించిన ట్వీట్లపై అభిమానుల్లో ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాకుండా వీటిపై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఐపిఎల్ సీజన్ 12 ఆరంభానికి ముందే ఆర్సిబి, సీఎస్‌కే ల మాటలతో పోటీ పడుతున్నారు.