సిడ్నీ: భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఓ అభిమానిపై నోరు పారేసుకున్నాడు. తనను ట్రోల్ చేసేందుకు ఓ అభిమాని ప్రయత్నించడంతో సహనం కోల్పోయాడు ఇడియట్ అంటూ అతనిపై విరుచుకుపడ్డాడు. 

ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన ఫొటోను పోస్టు చేసి, హెయిర్ స్టైల్‌కు సంబంధించి ఏవైనా సలహాలు, సూచనలు ఇవ్వాలని జడేడా కోరాడు. దాన్ని చూసి విపిన్ తివారీ అనే అభిమాని జడేజాకు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేశాడు. ముందు ఆటపై దృష్టిపెట్టాలని, బ్యాటింగ్ ఒక్కటే సరిపోదని, ఆల్‌రౌండర్ ప్రదర్శన ఇవ్వడానికి కొద్దిగా దృష్టిపెట్టాలని చెప్పాడు.
 
దానికి జడేజా తీవ్రంగా ప్రతిస్పందించాడు. "మీ ఇంట్లో టీవీ లేదా? ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టు మ్యాచ్ చూడలేదా, ఇడియట్?" అని విపిన్‌ ను దూషించాడు. జడేజా నోటి దురుసుపై నెటిజన్లు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరికొందరుఅతడికి అండగా నిలిచారు. ఇటువంటి వారి వ్యాఖ్యలను పట్టించుకోవద్దని సూచించారు. జడేజా సమాధానంతో తివారీ మాట మార్చాడు. తన కామెంట్‌కు స్పందిస్తారో, లేదోననే అటవంటి కామెంట్ చేశానని తివారీ అన్నాడు. "నీలాంటి గొప్ప ఆల్ రౌండర్ జట్టుకు ఎంతో అవసరమ"ని  అన్నాడు.