56 ఏళ్ల వయసులో.. 36 ఏళ్ల అమ్మాయితో టీమిండియా కోచ్ రవిశాస్త్రి ప్రేమాయణం..?

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 3, Sep 2018, 3:05 PM IST
ravi shastri dating with nimrat kaur..?
Highlights

ఇంగ్లాండ్ పర్యటనకు ఏ ముహూర్తాన వెళ్లాడో కానీ... టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు బొజ్జ నిండా తిని కునుకు పాట్లు పడటం, తన ఫిట్‌నెస్‌ను పక్కనబెట్టి భారీ బొజ్జతో కనిపించడం, కూల్‌డ్రింక్ ప్రమోషన్ చేయడం ఇలా ఒకటేమిటి అన్ని వివాదాలే.

ఇంగ్లాండ్ పర్యటనకు ఏ ముహూర్తాన వెళ్లాడో కానీ... టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు బొజ్జ నిండా తిని కునుకు పాట్లు పడటం, తన ఫిట్‌నెస్‌ను పక్కనబెట్టి భారీ బొజ్జతో కనిపించడం, కూల్‌డ్రింక్ ప్రమోషన్ చేయడం ఇలా ఒకటేమిటి అన్ని వివాదాలే. తాజాగా రవిశాస్త్రి గురించి ఓ పుకారు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రముఖ బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్‌తో రవిశాస్త్రి డేటింగ్‌ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మోడల్‌గా కెరీర్ ఆరంభించిన నిమ్రత్ కౌర్.. మ్యూజిక్ వీడియోల ద్వారా పాపులర్ అయ్యింది. దీని తర్వాత వచ్చిన ఫేమ్‌తో బాలీవుడ్ సినిమాల్లో నటించింది. ఈమె వయసు 36 కాగా, రవిశాస్త్రి వయసు 56 సంవత్సరాలు.. వీరిద్దరికి రెండేళ్ల నుంచి పరిచయం ఉందని... ఒక ప్రమోషన్ కార్యక్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా.. ప్రేమగా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాకపోతే ప్రస్తుతం నిమ్రత్ కూడా లండన్‌లోనే ఉండటం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. రవిశాస్త్రికి గతంలోనే రితూ అనే ఆమెతో పెళ్లయ్యింది. అయితే పదేళ్ల నుంచి వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. మొన్నామధ్య భార్యాభర్తలు విడాలకు తీసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి.

1980ల ప్రాంతంలో నాటి బాలీవుడ్ నటి అమృతా సింగ్‌తో రవిశాస్త్రి డేటింగ్ చేశారు.. తాజాగా ఈ వయసులో ప్రేమ, డేటింగ్ అనే వార్తలు రావడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిలో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

loader