టోక్యో ఒలంపిక్స్ కి ముందు సింధు కి షాక్... తప్పుకున్న కోచ్

సింధు వరల్డ్ ఛాంపియన్ గా గెలవడానికి సహకరించిన దక్షిణ కొరియాకు చెందిన మహిళా కోచ్‌ కిమ్ జి హ్యున్ తన పదవికి రాజీనామా చేశారు. భారత మహిళల సింగిల్స్‌ కోచ్‌గా నాలుగు నెలలు మాత్రమే సేవలందించిన హ్యుస్‌ వ్యక్తిగత కారణాలతో ఆ బాధ్యతలను నుంచి తప్పుకున్నారు

PV Sindhu suffers huge setback after Coach Kim Ji Hyun quits

త్వరలో టోక్యో ఒలంపిక్స్ ప్రారంభం కానున్నాయి. ఈ ఒలంపిక్స్ కోసం తెలుగు తేజం పీవీ సింధు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉంది. ఇటీవల వరల్డ్ ఛాంపియన్ షిప్ సాధించిన సింధు... ఈ టోక్యో ఒలంపిక్స్ లో కూడా స్వర్ణం గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే... ఈ టోర్నమెంట్ ప్రారంభం కావడానికి మరో సంవత్సరం కూడా సమయం లేదు అనుకునే సమయంలో సింధుకి ఊహించని షాక్ తగిలింది.

సింధు వరల్డ్ ఛాంపియన్ గా గెలవడానికి సహకరించిన దక్షిణ కొరియాకు చెందిన మహిళా కోచ్‌ కిమ్ జి హ్యున్ తన పదవికి రాజీనామా చేశారు. భారత మహిళల సింగిల్స్‌ కోచ్‌గా నాలుగు నెలలు మాత్రమే సేవలందించిన హ్యుస్‌ వ్యక్తిగత కారణాలతో ఆ బాధ్యతలను నుంచి తప్పుకున్నారు. గత నాలుగు నెలలుగా ఆమె పీవీ సింధుకు శిక్షణ ఇచ్చారు. వరల్డ్ నంబర్ 5 బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఉన్న సింధు వరల్డ్ ఛాంపియన్‌గా మారడంలో హ్యున్ దే ప్రధాన పాత్ర. ఆమె శిక్షణ కారణంగానే  విశ్వవిజేతగా సింధూ నిలిచింది.

 అయితే...హ్యున్ భర్త కొద్ది వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆయనకు సర్జరీ కావడంతో ఆరు నెలలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ ఆరు నెలల పాటు భర్తను చూసుకునేందుకు హ్యున్ వెళ్లారు. ఆమె మళ్లీ వచ్చే అవకాశం లేనట్లు తెలిసింది.  దాంతోనే తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆమె అకస్మాత్తుగా ఇలా వెళ్లిపోవడం సింధుని డైలమాలో పడేసినట్లు సమాచారం. ఈ విషయంలో సింధూకి పెద్ద షాకే తగిలింది. ఈ షాక్ నుంచి తేరుకొని... సింధు ఎలా విజయం సాధిస్తుందో చూడాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios