Asianet News TeluguAsianet News Telugu

ప్రో కబడ్డి 2019: ప్రదీప్ వీరోచిత పోరాటం...జైపూర్ పై పాట్నా అద్భుత విజయం

ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో పాట్నా ఫైరేట్స్  అదరగొట్టింది. జైపూర్ పింక్ పాంథర్స్ పై కేవలం 3 పాయింట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. 

pro kabaddi 2019: patna pairates  victory against jaipur pink  panthers
Author
Kolkata, First Published Sep 12, 2019, 9:02 PM IST

ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో పాట్నా ఫైరేట్స్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సీజన్ ఆరంభం నుండి వరుస ఓటములతో సతమతమవుతున్న ఫైరేట్స్ మెళ్లిగా గాడినపడతోంది. ఇవాళ(గురువారం) జైపూర్ పింక్ పాంథర్స్ తో హోరాహోరీగా పోరాడిన పాట్నాటీం కేవలం 3 పాయింట్ల స్వల్ప తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో పాయింట్స్ పట్టికలో చిట్టచివరన  నిలిచిన జట్టును మెళ్లిగా పైకి ఎగబాకింది. 

కోల్‌కతాలోని నేతాజి ఇండోర్  స్టేడియం వేదికన జరిగిన ఈ మ్యాచ్ లో పాట్నా ప్టార్ రైడర్స్ ప్రదీప్ నర్వాల్ అదరగొట్టాడు. అతడు 14 పాయింట్లతో చివరివరకు వీరోచితంగా పోరాడి జట్టుకు విజయాన్ని సాధించిపెట్టాడు. మిగతా ఆటగాళ్లలో లీ జంగ్ కున్ 8, నీరజ్ 6, జయదీప్ 3 పాయింట్లతో రాణించారు. ఇలా రైడింగ్ లో 24, ట్యాకిల్స్ లో 10, ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్‌ట్రాల రూపంలో 1  మొత్తం 36  పాయింట్లు సాధించిన ఫైరేట్స్ జట్టు పింక్ పాంథర్స్ ను మట్టికరిపించింది. 

జైపూర్ టీం లో సుశీల్ 8, నితిన్ 6, దీపక్ 5, సుదీప్ 5 పాయింట్లు సాధించినా ఫలితం లేకుండా పోయింది.  రైడింగ్ లో 24, ట్యాకిల్స్ లో 9, ఎక్స్‌ట్రాల ద్వారా 1 ఇలా మొత్తం 33 పాయింట్లు మాత్రమే సాధించిన జైపూర్ జట్టు కేవలం 3 పాయింట్ల స్వల్ప తేడాతో ఓడిపోయింది.  

 

 

Follow Us:
Download App:
  • android
  • ios