ప్రో కబడ్డి లీగ్ 2019 లో బెంగళూరు బుల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఆ జట్టు స్టార్ రైడర్ పవన్ కుమార్ ఆకాశమే  హద్దుగా చెలరేగడంతో హర్యానా స్టీలర్స్ పై బుల్స్ 
సునాయాసంగా గెలుపొందింది. అతడొక్కడే రైడింగ్ లో  34 మొత్తంగా 39 పాయింట్లు సాధించాడు. దీంతో 23 పాయింట్ల తేడాతో బెంగళూరు విజేతగా నిలిచింది.  

బెంగళూరు స్టార్ రైడర్ పవన్ కుమార్ 39 పాయింట్లతో చెలరేగాడు. హర్యానా రైడర్స్ అందరూ కలిసి కేవలం 31 పాయింట్లు సాధిస్తే పవన్ ఒక్కడే అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించాడు. దీంతో బెంగళూరు జట్టు రైడింగ్ లో 39, ట్యాకిల్స్ లో 10, ఆలౌట్ల ద్వారా 8, ఎక్స్‌ట్రాల రూపంలో 2 మొత్తం 59 పాయింట్లతో అద్భుత విజయాన్ని అందుకుంది. 

హర్యానా జట్టు రైడింగ్ లో 31, ట్యాకిల్స్ లో 3, ఆలౌట్ల ద్వారా 2 ఇలా కేవలం 36 పాయింట్లు మాత్రమే సాధించింది. ఆటగాళ్లలో ప్రశాంత్ 17, వికాస్ 6, వినయ్ 5. నవీన్ 3 పాయింట్లు సాధించినా ఫలితంలేకుండాపోయింది. ఈ మ్యాచ్  మొత్తంలో బెంగళూరు ఆసాంతం ఆదిపత్యం ప్రదర్శించింది.