ఐపీఎల్ ఫైనల్ చేరిన చెన్నై. (వీడియో)

ఐపీఎల్ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫైనల్‌కు చేరింది. వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం రాత్రి జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై 2 వికెట్ల తేడాతో విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని సీఎస్‌కే 19.1 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇరు జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో సీఎస్‌కేనే పైచేయి సాధించింది. డుప్లెసిస్ సమయోచిత హిట్టింగ్‌తో చెన్నైకి 5 బంతులు మిగిలి ఉండగానే 140/8తో విజయాన్ని అందించాడు.