Asianet News TeluguAsianet News Telugu

పూజా గెహ్లాట్‌‌‌కు ప్రేరణ కలిగించేలా ప్రధాని మోదీ ట్వీట్.. సోషల్ మీడియాలో ప్రశంసలు.. పాక్ జర్నలిస్ట్ సైతం..

ప్రధాని మోదీపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడాకారులకు ప్రధాని మోదీ ఇస్తున్న పోత్సహం.. దేశంలో క్రీడారంగం అభివృద్దికి ఎంతగానో దోహదపడుతుందని  కొనియోడుతున్నారు. 

PM Modi words of motivation for wrestler Pooja Gehlot wins hearts Pak Journalist Also reacted
Author
First Published Aug 7, 2022, 1:53 PM IST

ప్రధాని మోదీపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడాకారులకు ప్రధాని మోదీ ఇస్తున్న పోత్సహం.. దేశంలో క్రీడారంగం అభివృద్దికి ఎంతగానో దోహదపడుతుందని  కొనియోడుతున్నారు. ఇలాంటి ప్రశంసలు భారతదేశంలోని సోషల్ మీడియా యూజర్ల నుంచే కాకుండా.. పాకిస్తాన్‌కు చెందిన జర్నలిస్టు నుంచి రావడం విశేషం. అసలేం జరిగిందంటే.. కామన్వెల్త్ గేమ్స్ మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌లో కెనడాకు చెందిన మాడిసన్ పార్క్స్ చేతిలో భారత రెజ్లర్ పూజా గెహ్లాట్‌ ఓడిపోయింది. ఆ తర్వాత స్కాట్లాండ్‌కు చెందిన క్రిస్టెల్లె‌తో జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో పూజ విజయం సాధించింది. 

అయితే తాను కాంస్య పతకానికే పరిమితం కావడంపై మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. పూజా గెహ్లాట్ భావోద్వేగానికి గురైంది. భారత ప్రజలకు క్షమాపణ చెప్పింది. ‘‘నేను నా స్వదేశీయులకు క్షమాపణలు చెబుతున్నాను. ఇక్కడ జాతీయ గీతం వినిపించాలని నేను కోరుకున్నాను.. కానీ నేను నా తప్పుల నుండి నేర్చుకుని వాటిపై పని చేస్తాను’’ అని పూజా గెహ్లాట్ కన్నీరు పెట్టుకున్నారు. 

 

అయితే పూజా గెహ్లాట్ నిరుత్సాహానికి గురికావడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆమెలో ఉత్తేజం నింపే మాటలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘‘పూజా.. మీ పతకం వేడుకలకు పిలుపునిస్తుంది.. మీరు చెప్పాల్సింది క్షమాపణ కాదు. మీ జీవిత ప్రయాణం మమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ విజయం మమ్మల్ని సంతోషపరుస్తుంది. మీరు భవిష్యత్తులో గొప్ప విషయాల సాధించగలరు... కీప్ షైనింగ్’’ అని మోదీ ట్వీట్ చేశారు.   ప్రధాని వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇక, పాకిస్తాన్ జర్నలిస్ట్ Shiraz Hassan ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌పై స్పందించారు. ‘‘ భారత్ వారి అథ్లెట్లను ఇలా ప్రోత్సహిస్తుంది. పూజా గెహ్లాట్ కాంస్యం గెలుచుకుంది. అయితే ఆమె బంగారు పతకం సాధించలేకపోయినందుకు విచారం వ్యక్తం చేసింది. దీంతో ప్రధాని మోదీ స్పందించారు. పాకిస్తాన్ ప్రధాని లేదా అధ్యక్షుడి నుంచి ఇలాంటి సందేశాన్ని ఎప్పుడైనా చూశారా?. పాకిస్తానీ అథ్లెట్లు పతకాలు గెలుస్తున్నారని వారికి తెలుసా?’’ అని షిరాజ్ హసన్ ట్వీట్ చేశారు. 

మరోవైపు చాలా మంది సోషల్ మీడియా యూజర్లు కూడా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. క్రీడా రంగానికి ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానం, ప్రోత్సాహం.. క్రీడా పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని నెటిజన్స్ పేర్కొంటున్నారు. ఇది రానున్న రోజుల్లో మరింత మంది క్రీడాకారులకు మార్గం సుగమం చేస్తుందని పోస్టులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ట్వీట్స్‌ను మీరు ఇక్కడ చూడవచ్చు.. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios