ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, రహానే సమయోచితంగా ఆడుతూ జట్టును ఆదుకున్నారు. రెండో ఆసీస్ జట్టును తొందరగానే ఆలౌట్ చేసిన టీంఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు మురళీ విజయం, రాహుల్ లు జట్టు స్కోరు 8 పరుగుల వద్ద ఉండగానే ఔటయ్యారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పుజారా, కోొహ్లీలు పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 

ఈ క్రమంలో నెమ్మదిగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జగ్రత్త పడ్డారు. అయితే 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టార్క్ బౌలింగ్ లో పుజారా ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రహానేతో కలిసి కోహ్లీ చక్కటి బాగస్వామ్యం నెలకొల్పి రెండో రోజు మరో వికెట్ పడకుండా ఆటను ముగించారు. కోహ్లీ ప్రస్తుతం 82 పరుగులు, రహానే 51 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.   

పెర్త్ లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌‌లో భారత బ్యాట్ మెన్స్ తడబడుతున్నారు. రెండో రోజు ఆట మొదలవగానే భారత బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. అయితే ఆసీస్ ఆలౌట్ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్ కేవలం 8 పరుగులకే  ఓపెనర్లిద్దరిని కోల్పోయి కష్టాల్లో పడింది. 

ఓవర్ నైట్ స్కోర్ 277 పరుగుల వద్ద రెండోరోజు బ్యాటింగ్ కు దిగిన ఆసిస్‌ను భారత బౌలర్లు తొందరగానే కట్టడి చేశారు. దీంతో భారత్ కాస్త పైచేయి సాధించిందని  భావిస్తున్న సమయంలో ఆసిస్ బౌలర్లు కూడా భారత్ కు షాకిచ్చారు. మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ను ఆదిలోనే దెబ్బతీశారు. కేవలం 8 పరుగులకే రెండు వికెట్లు తీసి భారత్ ను కష్టాల్లోకి నెట్టారు. 

భారత ఓపెనర్లలో మురళీ విజయ్ డకౌట్(0 పరుగులు 12బంతుల్లో) అయ్యారు. అతన్ని ఆసిస్ బౌలర్ స్టార్క్ ఔట్ చేశాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ రాహుల్ కూడా 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు.  అతన్ని హెజిల్ వుడ్ ఔట్ చేశాడు. ప్రస్తుతం చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నారు. ఆదిలోనే రెండు వికెట్లు పడటంతో వీరిద్దరు ఆచి తూచి ఆడుతున్నారు. 

సంబంధిత వార్తలు

పెర్త్ టెస్ట్: మొదటిరోజు చెరి సగం...ఆసిస్ స్కోరు 277/6