బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా  పెర్త్ లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌‌లో మొదటిరోజు మిశ్రమ ఫలితం వెలువడింది. మొదట బ్యాంటింగ్ కు దిగిన ఆసిస్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. అయితే వారు ఔటైన తర్వాత ఆసిస్  కాస్త తడబడినా మ్యాచ్ ముగిసే సయానికి గౌరవప్రదమైన స్కోరు సాధించింది. మొదటిరోజు ఆసిస్ 6 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. 

ఆసిస్ బ్యాట్ మెన్స్ లో హారిస్ 70, ఫించ్ 50, మార్ష్ 45, హెడ్ 58, ఖవాజ 5, హ్యాండ్ కాబ్ 7 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో కమ్మిన్స్(11)  , పయినే(16) బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ, విహారి చెరో రెండు వికెట్లు పడగొట్టగా బుమ్రా, యాదవ్ చెరో వికెట్ తీశారు. 

బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా భారత్‌తో పెర్త్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ ఓపెనర్లు ఫించ్, హ్యారీస్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు.

మ్యాచ్ ప్రారంభం నుంచి ధాటిగా ఆడిన వీరిద్దరూ భారత బౌలర్లను ఉతికి ఆరేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కుదురుకుంటున్న  దశలో బుమ్రా బౌలింగ్‌లో ఫించ్ అవుటయ్యాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికే ఉస్మాన్ ఖవాజా, హ్యారీస్ వెనుదిరిగారు. ఈ క్రమంలో షాన్ మార్ష్, హ్యాండ్స్ కోబ్‌ల జోడీ కాసేపు ప్రతిఘటించేందుకు ప్రయత్నించింది. కానీ ఇషాంత్ బౌలింగ్‌లో హ్యాండ్స్‌కోబ్ ఔటవ్వడంతో ఆసీస్ కష్టాల్లో పడింది.  ప్రస్తుతం ఆస్ట్రేలియా 56 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. షాన్ మార్ష్ 12, ట్రేవిస్ హెడ్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.