ఇంగ్లాండ్ అల్‌టైమ్ గ్రేట్ లిస్టర్ కుక్ రిటైర్‌మెంట్‌తో ఆ జట్టు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. దీని నుంచి కోలుకోకముందే మరో గొప్ప ఆటగాడు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 

ఇంగ్లాండ్ అల్‌టైమ్ గ్రేట్ లిస్టర్ కుక్ రిటైర్‌మెంట్‌తో ఆ జట్టు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. దీని నుంచి కోలుకోకముందే మరో గొప్ప ఆటగాడు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అల్‌రౌండర్ పాల్ కాలింగ్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

22 ఏళ్ల క్రితం ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో కెరీర్‌ను ప్రారంభించిన కాలింగ్‌వుడ్ ఇంగ్లాండ్‌కు ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. వుడ్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ మూడుసార్లు యాషెస్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. 2010లో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని.. తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది.

ఇప్పటీ వరకు 68 టెస్టులు ఆడిన కాలింగ్ వుడ్ 4259 పరుగులు చేయగా.. ఇందులో పది సెంచరీలు, 20 అర్థసెంచరీలు ఉన్నాయి. 197 వన్డేల్లో 5092 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 26 అర్థసెంచరీలు ఉన్నాయి. 36 టీ20లలో 583 పరుగులు చేశాడు. ఎన్నో తర్జనబర్జనలు, చర్చల తర్వాత క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నానని.. తాను కెరీర్‌కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని కాలింగ్‌వుడ్ తెలిపాడు.