పుల్వామాలో ఉగ్రదాడికి పాకిస్తాన్‌పై దేశప్రజలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా ముంబై బ్రాబౌర్న్ స్టేడియంలో ఉన్న పాక్ క్రికెటర్ల ఫోటోలను తొలగించిన విషయం తెలిసిందే.. తాజాగా ఇదే బాటలో నడిచింది హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్.
పుల్వామాలో ఉగ్రదాడికి పాకిస్తాన్‌పై దేశప్రజలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా ముంబై బ్రాబౌర్న్ స్టేడియంలో ఉన్న పాక్ క్రికెటర్ల ఫోటోలను తొలగించిన విషయం తెలిసిందే..
తాజాగా ఇదే బాటలో నడిచింది హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్. సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడిని నిరసిస్తూ ధర్మశాలలోని మైదానంలోని పాకిస్తాన్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, జావెద్ మియాందాద్‌తో సహా మొత్తం పాక్ ఆటగాళ్ల ఫోటోలను తొలగించాలని మేనేజింగ్ కమిటీ నిర్ణయించింది.
2005లో టీమిండియా పర్యటన నేపథ్యంలో ధర్మశాలలో బోర్డ్ ప్రెసిడెంట్ ఎలవన్‌తో పాక్ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ సందర్భంగా షోయబ్ అక్తర్, షాహిద్ ఆఫ్రిది ఫోటోలతో పాటు ఇతర క్రికెటర్ల ఫోటోలను మైదానంలో ఉంచారు.
ఉగ్రదాడి నేపథ్యంలో వాటిని తొలగిస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. జవాన్లపై దాడికి నిరసనగా, అదే విధంగా దేశ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తెలిపినట్లు అసోసియేషన్ వివరించింది.
