జోక్ చేయకండి.. చెత్త ఆటగాడు.. బెస్ట్ వికెట్ కీపరేంటీ..?

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 10, Aug 2018, 12:36 PM IST
pakistan cricket fans fires on kamran Akmal as best wicket keeper
Highlights

పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్‌పై ఆ దేశ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ క్రికెట్‌లో 2017-18 క్యాలెండర్ ఇయర్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అవార్డులు, రివార్డులు ప్రకటించింది

పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్‌పై ఆ దేశ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ క్రికెట్‌లో 2017-18 క్యాలెండర్ ఇయర్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అవార్డులు, రివార్డులు ప్రకటించింది. ఈ జాబితాలో దేశీవాలీ క్రికెట్‌లో కమ్రాన్ అక్మల్‌కు బెస్ట్ వికెట్ కీపర్ అవార్డ్‌ను ప్రకటించారు..

అంతే పాక్ క్రికెట్ అభిమానులు అంతెత్తున లేచారు. కమ్రాన్ బెస్ట్ వికెట్ కీపర్ ఏంటీ..? జోకులొద్దు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు... ‘‘ బెస్ట్ వికెట్ కీపర్ అవార్డ్ కమ్రాన్‌కు దక్కిందంటే .. మన దేశవాళీ క్రికెట్ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమవుతోందని’’.. ‘‘ఇంత చెత్తగాడు బెస్ట్ వికెట్ కీపర్ అయితే పాక్‌లో వికెట్ కీపర్‌ల కొరత ఉన్నట్లేనని’’ మరో అభిమాని కామెంట్ చేశాడు.

కాగా, ఇటీవల న్యూజీలాండ్‌తో డబుల్ సెంచరీ చేసిన ఫకార్ జమాన్‌కు 2.5 మిలియన్ రూపాయలతో ప్రత్యేక అవార్డును అందజేశారు. బెస్ట్ టెస్ట్ క్రికెటర్‌గా మహ్మాద్ అబ్బాస్, వన్డే ప్లేయర్‌గా హసన్ అలీలకు పురస్కారాలు దక్కాయి.
 

loader