ODI WC 2023 : పాకిస్టాన్ నెట్ బౌలర్ గా హైదరాబాదీ యువకెరటం.. ఎవరీ కుర్రాడు...?
వార్మప్ మ్యాచ్ కోసం హైదరాబాద్ లో ఉన్న పాకిస్తాన్ జట్టుకు ఓ హైదరాబాదీ కుర్రాడు నెట్ బౌలింగ్ లో చుక్కలు చూపిస్తున్నాడు.

హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఇప్పుడు వన్డే ప్రపంచకప్ 2023 కోసంఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వన్డే ప్రపంచ కప్ -2023కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మ్యాచ్ తో అక్టోబర్ ఐదు న ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నీ ప్రారంభం కావడానికి ముందు వార్మ్ ఆఫ్ మ్యాచులు ఆడనున్నారు. దీనికి అంత సిద్ధమవుతుంది.
సెప్టెంబర్ 29 నుంచి అంటే నేటి నుంచి అక్టోబర్ 3 వరకు ఈ వార్మప్ మ్యాచ్ లు జరగనున్నాయి. హైదరాబాద్, తిరువనంతపురం, గువాహటి వేదికలుగా ఈ ప్రాక్టీస్ మ్యాచులు జరుగుతాయి. ఇందులో భాగంగానే శుక్రవారం హైదరాబాదులో పాకిస్తాన్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్ తో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లలో భాగంగా పాకిస్తాన్ జట్టు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది.
వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ డిజైన్ వెనక ఇన్ని విషయాలు దాగి ఉన్నాయా... అందుకే దీనికి ఇంత క్రేజ్..
ప్రాక్టీస్ సెషన్స్ కూడా ప్రారంభించింది. ఇదంతా రెగ్యులర్గా ఎప్పుడూ జరిగే విషయమే అయినప్పటికీ ఈసారి పాక్ జట్టు తమ నెట్ బౌలర్ గా నియమించుకున్న… ఆటగాడే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. హైదరాబాద్ అండర్ 19 ఫాస్ట్ బౌలర్ నిశాంత్ సరను పాకిస్తాన్ తమ నెట్ బౌలర్గా పెట్టుకుంది. దీంతో కివీస్ వార్మప్ మ్యాచ్ కు ముందు పాక్ బ్యాటర్లకు నెట్స్లో బౌలింగ్ చేస్తూ నిశాంత్ కనిపించాడు.
ఈ యువ హైదరాబాది పేసర్ గంటకి 140 నుంచి 150 వేగంతో బంతులు వేస్తాడు. ఆరు అడుగులకుపైగా ఉన్న నిశాంత్ సరను బౌన్సర్స్ ను సంధించగలడు. పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ నిశాంత్ బౌలింగ్ కి ఫిదా అయిపోయాడు. నెట్స్లో అతని బౌలింగ్ ను ఎదుర్కొన్న జమాన్ నిశాంత్ మీద ప్రశంసల వర్షం కురిపించాడు.
నిశాంత్ బౌలింగ్ మీద మాట్లాడుతూ ఫకర్ జమాన్ అతడికి అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. నిశాంత్ కచ్చితంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటాడని కొనియాడాడు. ఆస్ట్రేలియా స్టార్ పేసర్లు మిచెల్ స్టార్క్, బ్యాట్ కమ్మిన్స్ తనకు ఆదర్శమని నిశాంత్ చెప్పుకొచ్చాడు.హైదరాబాద్ కు ఆడాలని తన కోరిక అంటూ తెలిపాడు.