నోవాక్ జొకోవిచ్‌కి షాక్... ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి అవుట్, దేశం నుంచి బహిష్కరణ....

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022కి నొవాక్ జొకోవిచ్ దూరం... వ్యాక్సిన్ కోర్సు పూర్తి చేసుకోకుండా ఆస్ట్రేలియా అడుగుపెట్టిన వరల్డ్ నెం.1కు ఘోర అవమానం... రెండు సార్లు వీసా రద్దు, దేశం  నుంచి బహిష్కరణ... 

Novak Djokovic to not play Australian Open, faces deportation as visa cancellation

టెన్నిస్ దిగ్గజం నోవాక్ జొకోవిచ్‌కి ఆస్ట్రేలియాలో ఘోర పరాభవం ఎదురైంది. వ్యాక్సిన్ కోర్సు పూర్తి చేసుకోకుండా దేశంలో అడుగుపెట్టినందుకు వీసాను రద్దు చేసి, ఘోరంగా అవమానించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఇప్పుడు అతన్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. 9 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన వరల్డ్ నెం.1 టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్, ఈసారి ఈ టోర్నీలో పాల్గొనకుండానే ఇంటిదారి పట్టనున్నాడు. 

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 టోర్నీ ఆడేందుకు జనవరి 4న ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన వరల్డ్ నెం.1 టెన్నిస్ దిగ్గజం నోవాక్ జొకోవిచ్‌ వీసాను రెండుసార్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. వ్యాక్సిన్ కోర్సు పూర్తి చేసుకోకుండా దేశంలో అడుగుపెట్టినందుకు మొదటిసారి ఆస్ట్రేలియా ప్రభుత్వం మొదటిసారి జొకోవిచ్ వీసా రద్దు చేయగా, ఆ తర్వాత ఆ దేశ ఇమిగ్రేషన్ మినిస్టర్ అలెక్స్ హ్యాకీ, తన అధికారాలను వినియోగించి, నోవాక్ వీసాని రద్దు చేశారు. 

టెన్నిస్ స్టార్ ప్లేయర్, వరల్డ్ నెం.1 సెర్భియా టెన్నిస్ దిగ్గజం నోవాక్ జొకోవిచ్‌‌ ఆసీస్ వీసా రద్దు చేయడంతో దుమారం రేగింది.. దాదాపు 11 రోజులుగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ పాల్గొంటాడా? లేదా? అని సాగిన హై డ్రామాకి తెరదించుతూ సోమవారం నోవాక్ వీసా రద్దు చెల్లదంటూ ప్రకటించింది న్యాయస్థానం... కరోనా థర్డ్ వేవ్‌, ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో ఆస్ట్రేలియా...  వ్యాక్సిన్ కోర్సు పూర్తి చేసుకున్నవారికి మాత్రమే తమదేశంలోకి అనుమతిస్తామని నిబంధనను తీసుకొచ్చింది...

అయితే సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్, కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక వైద్య మినహాయింపులతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన తర్వాత ఎయిర్‌పోర్ట్ అధికారులు, జొకోవిచ్‌ని అడ్డుకుని అవమానించారు... 

మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులో జొకోవిచ్‌ని అడ్డుకున్న అధికారులు, వ్యాక్సినేషన్ మినహాయింపు పొందడానికి అతను సమర్పించిన కారణాలు సరిగా లేవని, క్వారంటైన్ పీరియడ్‌ను పూర్తి చేయకపోతే దేశంలోకి అనుమతించేది లేదంటూ తేల్చి చెప్పేశారు.  వరల్డ్ నెం.1 టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ వీసాను కూడా రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఆస్ట్రేలియా ప్రభుత్వం...

దీంతో జొకోవిచ్, న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాడు. టెన్నిస్ ఫెడరల్ సర్క్యూట్‌తో పాటు ఆస్ట్రేలియన్ ఫ్యామిలీ కోర్టు ఇరువర్గాల వాదనలను విన్న తర్వాత జొకోవిచ్‌కి అనుమతినిచ్చింది. జొకోవిచ్ వీసాను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు కూడా అతనికి అనుమతిచ్చింది...

అంతేకాకుండా నొవాక్ జొకోవిచ్‌ చెల్లించిన లీగల్ ఛార్జీలను కూడా అతనికి తిరిగి ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. అయితే ఇమిగ్రేషన్ మినిస్టర్ అలెక్స్ హాకీ తన అధికారాన్ని ఉపయోగించి, నొవాక్ జొకోవిచ్‌ వీసాని తిరిగి రద్దు చేయవచ్చని, అలా చేస్తే వరల్డ్ నెం.1 టెన్నిస్ ప్లేయర్‌పై మూడేళ్ల పాటు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టకుండా నిషేధం విధించే అధికారం కూడా ఉంటుందని తెలిపింది న్యాయస్థానం...

తాజాగా అలెక్స్ హాకీ అదే చేశాడు... తనకున్న ప్రత్యేకమైన అధికారంతో నొవాక్ జొకోవిచ్ వీసాని మరోసారి రద్దు చేశాడు... నొవాక్ జొకోవిచ్ కావాలంటే మరోసారి న్యాయస్థానానికి అప్పీలు చేసుకోవచ్చని సూచించాడు ఆసీస్ ఇమిగ్రేషన్ మినిస్టర్...  అయితే రెండోసారి జొకోవిచ్ అప్పీలును ఫెడరల్ కోర్టు తిరస్కరించింది.

 2021, డిసెంబర్ 16న నొవాక్ జొకోవిచ్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఈ విషయాన్ని దాచి ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొవాలని చూశాడు జొకోవిచ్... 2022, జనవరి 8న కోర్టు విచారణలో జొకోవిచ్‌కి కరోనా సోకినట్టు తేలింది.  దీంతో ఈ వివాదం మరింత ముదిరినట్టైంది.  

2008 నుంచి 9 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ గెలిచిన నోవాక్ జొకోవిచ్, 2019 నుంచి వరుసగా మూడు సీజన్లలోనూ టైటిల్స్ గెలిచాడు. గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో రష్యన్ టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వేదెవ్‌‌ను ఫైనల్‌లో 7-5, 6-2, 6-2 తేడాతో ఓడించి టైటిల్ సాధించాడు నోవాక్ జొకోవిచ్... ఈ ఏడాది జనవరి 17 నుంచి జనవరి 30 వరకూ ఆస్ట్రేలియన ఓపెన్ 2022 టోర్నీ జరగనుంది. ఈసారి వరల్డ్ నెం.1 జొకోవిచ్ లేకుండానే ఆస్ట్రేలియన్ ఓపెన్ సాగనుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios