వింబుల్డన్ ఫైనల్ ఓటమి తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న నోవాక్ జొకోవిచ్.. అప్పుడు రోజర్ ఫెదరర్‌ని కూడా...
20 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్ చేతుల్లో 1-6, 7-6, 6-1, 3-6, 6-4 తేడాతో ఓడిన నొవాక్ జొకోవిచ్... రోజర్ ఫెదరర్‌పైన కూడా గెలిచిన నన్ను, ఈ బుడ్డోడు ఓడించాడంటూ కామెంట్స్..
టెన్నిస్ ప్రపంచంలో 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన టాప్‌లో ఉన్నాడు సెర్బియన్ స్టార్ నోవాక్ జొకోవిచ్. 7 సార్లు వింబుల్డన్ టైటిల్స్ గెలిచిన నోవాక్ జొకోవిచ్, గత రెండు సీజన్లలోనూ టైటిల్ గెలిచాడు. సెంటర్ కోర్టులో తిరుగులేని రికార్డు ఉన్న నోవాక్ జోకోవిచ్‌కి కార్లోస్ అల్కరాజ్ చేతుల్లో ఊహించని పరాజయం ఎదురైంది..
23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన జొకోవిచ్‌పై ఇంతకుముందు ఒకే ఒక్క గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన కార్లోస్ అల్కరాజ్, 1-6, 7-6, 6-1, 3-6, 6-4 తేడాతో సంచలన విజయం అందుకున్నాడు. గ్రాండ్ స్లామ్ కెరీర్‌లో మొదటి సెట్ గెలిచిన తర్వాత ఎప్పుడూ గేమ్ ఓడిపోని జొకోవిచ్, 78-0 రికార్డు... అల్కరాజ్ దెబ్బకు 78-1గా మారింది..
20 ఏళ్ల స్పానిష్ టెన్నిస్ ప్లేయర్ అల్కరాజ్ చేతుల్లో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న నోవాక్ జొకోవిచ్, మ్యాచ్ అనంతరం కన్నీళ్లు పెట్టుకున్నాడు.
2013, జూలై 7న వింబుల్డన్ ఫైనల్‌లో ఆండీ ముర్రే చేతుల్లో ఓడిన జొకోవిచ్, ఆ తర్వాత ఫైనల్ చేరిన ప్రతీసారి టైటిల్ గెలుస్తూ వచ్చాడు.
‘ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ అద్భుతంగా ఆడాడు. అతను ఈ విజయానికి అన్ని విధాల అర్హుడు. ఇక్కడ అతనికి ఆడిన అనుభవం పెద్దగా లేకపోయినా పరిస్థితులను త్వరగా అర్థం చేసుకున్నాడు. నేను ఇంతకుముందు చాలా క్లోజ్ మ్యాచులను గెలిచాను. ఓడిపోవాల్సిన మ్యాచుల్లో కూడా గెలిచాను.. 2019 ఫైనల్ మ్యాచ్‌లో కూడా రోజర్ ఫెదరర్‌పై గెలవగలిగాను కానీ అల్కరాజ్... ఈ రోజు నన్ను ఓడించాడు..
ఇంత దగ్గరగా వచ్చిన తర్వాత మ్యాచ్ గెలవాల్సింది. అయితే బెటర్ ప్లేయర్ చేతుల్లో ఓడినందుకు సగర్వంగా ఉంది. మా అబ్బాయి ఇంకా ఇక్కడే నవ్వుతూ ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఐ లవ్ యూ... నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంకూ. నీకు ఓ పెద్ద హగ్ ఇస్తా, నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా... ’ అంటూ చెబుతూ ఎమోషనల్ అయ్యాడు నోవాక్ జొకోవిచ్..
వింబుల్డన్ 2023 టైటిల్‌కి ముందు యూఎస్ ఓపెన్ 2022 టైటిల్ విజేతగా నిలిచాడు కార్లోస్ అల్కరాజ్. 19 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్, యూఎస్ ఓపెన్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో నార్వే ప్లేయర్ కాస్పర్ రూడ్‌ని 4-6, 6-2, 6-7, 3-6 తేడాతో ఓడించి మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచాడు కార్లోస్ అల్కరాజ్..