Asianet News TeluguAsianet News Telugu

ఆడాళ్లు! మీకు జోహార్లు... వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో 2 స్వర్ణాలు! నేడు బరిలో నిఖత్ జరీన్...

81 కేజీల విభాగంలో పోటీపడిన 30 ఏళ్ల సవిటీ బుర్రాకి స్వర్ణం.. అంచనాలను అందుకుని గోల్డ్ గెలిచిన నీతూ గన్‌గాస్...

Nitu Ghangas, Saweety Boora wins 2 gold for India in Womens World boxing Championships cra
Author
First Published Mar 26, 2023, 9:34 AM IST

ఢిల్లీలో జరుగుతున్న ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్లు దుమ్ముదులిపారు. ఏకంగా నలుగురు భారత బాక్సర్లు ఫైనల్ చేరగా వారిలో శనివారం తలబడిన ఇద్దరు బాక్సర్లు కూడా స్వర్ణాలు కైవసం చేసుకున్నారు.. 48 కేజీల విభాగంలో తలబడిన 22 ఏళ్ల నీతూ గన్‌గాస్, ఫైనల్‌లో మంగోలియాకి చెందిన లూసాయ్‌ఖాన్‌ అల్టాంట్‌సెట్‌సెగ్‌పై 5-0 తేడాతో ఘన విజయం అందుకుంది...


81 కేజీల విభాగంలో పోటీపడిన 30 ఏళ్ల సవిటీ బుర్రా (స్వీటీ బుర్రా), చైనా బాక్సర్ వాంగ్ లీనాపై 4-3 తేడాతో విజయం అందుకుని వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకుంది.. 2006లో భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్, మొట్టమొదటిసారిగా భారత్ తరుపున ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ గెలిచింది...

 ‘ఈ విజయం నాకు చాలా స్పెషల్. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ కోసం ఎంతో కష్టపడ్డాను. 2012 నుంచి బాక్సింగ్ చేస్తున్నా, ప్రతీ విషయంలో నా కుటుంబం నాకు అండగా నిలిచింది... నా ఊరు మొత్తం నన్ను ప్రోత్సహించింది. బర్మింగ్‌హమ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడుతున్నప్పటి నుంచి నా కోసం వాళ్లు ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు కూడా ఫైనల్ మ్యాచ్ చూడడానికి మా ఊరి నుంచి చాలామంది ఇక్కడికి వచ్చారు..’ అంటూ చెప్పుకొచ్చింది భీవానీలోని ధనన గ్రామానికి చెందిన నీతూ..

ఇప్పటికే 2015, 2017లో యూత్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ గెలిచిన నీతూ, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పతకం గెలవడమే లక్ష్యంగా నీతూని సిద్ధం చేస్తున్నాడు ఆమె కోచ్, ఒలింపిక్ మెడల్ విన్నర్ విజేందర్ సింగ్...


ఈ రోజు జరిగే ఫైనల్‌లో మరో ఇద్దరు భారత బాక్సర్లు తలబడబోతున్నారు. తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌తో పాటు ఒలింపిక్ మెడలిస్ట్ లవ్‌లీనా బోరోహెన్ కూడా పసిడి వేటలో ఉన్నారు. 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్, నేటి సాయంత్రం 6 గంటలకు వియత్నాం బాక్సర్ గుయెన్ తి టామ్‌తో తలబడనుంది. సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు లవ్‌లీనా, ఆస్ట్రేలియా బాక్సర్ అన్నే పార్కర్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.. 

Follow Us:
Download App:
  • android
  • ios