స్వదేశంలో జరుగుతున్న ఔదు వన్డేల సీరిస్‌లో భారత చేతిలో ఓటమిని తప్పించుకునేందుకు న్యూజిలాండ్ జట్టు ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది.  భారత బ్యాటింగ్ లైనప్ బలంగా వుండటంతో వారినే టార్గెట్ చేసినట్లు కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వెల్లడించారు. ముఖ్యంగా టీంఇండియా జట్టులో విధ్వంసకారులైన కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలను కట్టడి చేయడంపై ప్రత్యేకంగా  వ్యూహాలు రచిస్తున్నట్లు బౌల్ట్ తెలిపాడు.

మొదటి వన్డేలో అటు బ్యాటింగ్,ఇటు బౌలింగ్ లో విఫలమైన కివీస్ జట్టు 1-0 తో వెనుకబడింది. దీంతో రెండో వన్డేలో గెలిచి భారత  ఆధిక్యాన్ని తగ్గించాలని కివీస్ భావిస్తోంది. అందుకోసం శనివారం మౌంట్ మాంగనూయ్ లో జరగనున్న రెండో వన్డేలో భారత జట్టును కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించింది.

ముఖ్యంగా మొదటి వన్డేలో రాణించిన బ్యాట్ మెన్స్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్‌లను, మరో విధ్వంసకారుడు రోహిత్ శర్మల వికెట్లనే కివీస్ లక్ష్యం చేసుకుంది. మొదటి పది ఓవర్లలోపే వీరిని పెవిలియన్ కు పంపిస్తే తమ పని సగం పూర్తవుతుందని బౌల్ట్ తెలిపాడు. వీరు తొందరగా ఔటయితే మిగతా ఆటగాళ్లు ఒత్తిడికి గురవుతారని...దీంతో భారత్ ను ఓడించే  మిగతా సగం పని కూడా ఈజీగా పూర్తవుతుందన్నాడు. 

ఇక తమ జట్టు బ్యాటింగ్ శైలిని కూడా మార్చనున్నట్లు బౌల్ట్ తెలిపాడు. మొదట మంచి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పితే చివర్లో వికెట్లో చేతిలో వుంటాయి కాబట్టి దాటిగా ఆడొచ్చని అన్నాడు. ఇదే ఫార్ములాను మిగతా వన్డేల్లో అమలు చేసి  భారత్ చిత్తు చేస్తామని బౌల్ట్ వెల్లడించాడు. 

వీడియో