Asianet News TeluguAsianet News Telugu

''మళ్లీ కాఫీ తాగుతున్నావా...?'' పాండ్యాపై నెటిజన్ల ట్రోలింగ్...

కాఫీ విత్ కరణ్ షో... టీంఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కెరీర్‌పై అత్యంత ప్రభావం చూపిన కార్యక్రమం. ఈ టివి షో లోనే పాండ్యా మహిళలు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అసభ్యంగా మాట్లాడి వివాదంలో చిక్కుకున్నాడు. కేవలం ఈ వివాదం పాండ్యా వ్యక్తిగత జీవితంపైనే కాదు ప్రొపెషనల్ జీవితంపై కూడా ప్రభావం చూపించింది. టీవీ షోలో పాండ్యా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపడంతో బిసిసిఐ అతడితో పాటు కెఎల్.రాహుల్ పై రెండు వన్డేల నిషేదం విధించిన విషయం తెలిసిందే. 

Netizens Troll Hardik Pandya
Author
Mumbai, First Published Feb 7, 2019, 9:13 PM IST

కాఫీ విత్ కరణ్ షో... టీంఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కెరీర్‌పై అత్యంత ప్రభావం చూపిన కార్యక్రమం. ఈ టివి షో లోనే పాండ్యా మహిళలు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అసభ్యంగా మాట్లాడి వివాదంలో చిక్కుకున్నాడు. కేవలం ఈ వివాదం పాండ్యా వ్యక్తిగత జీవితంపైనే కాదు ప్రొపెషనల్ జీవితంపై కూడా ప్రభావం చూపించింది. టీవీ షోలో పాండ్యా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపడంతో బిసిసిఐ అతడితో పాటు కెఎల్.రాహుల్ పై రెండు వన్డేల నిషేదం విధించిన విషయం తెలిసిందే. 

ఇలా ఈ వివాదం కారణంగా తీవ్ర వేధన అనుభవించిన తర్వాత ఇటీవలే పాండ్యాపై బిసిసిఐ నిషేదాన్ని ఎత్తేసింది. దీంతో అంతర్జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన పాండ్యా న్యూజిలాండ్ తో జరిగిన నాలుగు వన్డేలో అదరగొట్టాడు. ఇలా వివాదం నుండి బయటపడి సీరియస్ తన కెరీర్ పై దృష్టి పెట్టిన పాండ్యాను నెటిజన్లు మాత్రం వదలడం లేదు. అతడు ఏం చేసినా దాన్ని కాఫీ విత్ కరణ్ షో వివాదంతో పోలుస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు.

[విజయ్ దేవరకొండ బాక్స్ ఆఫీస్ ట్రాక్] 

తాజాగా హార్దిక్ పాండ్య తన సోదరుడు కృనాల్ పాండ్యా, ధోని, కేదార్ జాదవ్,, శుభ్ మన్ గిల్ తో కలిసి దిగిన ఫోటోను ఇన్స్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోకు ''కొద్దిగా ఫుడ్...మరికొద్దిగా నవ్వులు'' అనే కామెంట్ ను జతచేసి పోస్ట్ చేశాడు. అయితే ఈ ఫోటోపై కొందరు నెటిజన్లు సరదాగా, మరికొందరు సీరియస్ గా కామెంట్ చేస్తూ ట్రోల్
చేస్తున్నారు. 

కేవలం ఫుడ్, నవ్వులేనా...కాఫీ వద్దా అంటూ కొందరు కామెంట్ చేశారు. అలాగే మరికొంత మంది నెటిజన్లు  ''మళ్లీ కాఫీ తాగుతున్నావా..?''  ''కాఫీ కూడా తాగితే బాగుంటుంది''  ''కాఫీ మానేశావా'' అంటూ తమకు నచ్చిన విధంగా కామెంట్ చేస్తున్నారు. ఇలా బిసిసిఐ  క్షమించి వదిలేసినా నెటిజన్లు మాత్రం ఇప్పట్లో పాండ్యాను వదిలేలా లేరు. 

Some food and lots of laugh 😂 @mahi7781 @shubmangill @kedarjadhavofficial @krunalpandya_official

A post shared by Hardik Pandya (@hardikpandya93) on Feb 5, 2019 at 6:31pm PST

Follow Us:
Download App:
  • android
  • ios