ఘనంగా మొదలైన MTB హిమాచల్ మౌంటెన్ సైక్లింగ్ ఫెస్టివల్.. జంజెహ్లీ నుంచి మొదలై...

హిమాచల్‌ ప్రదేశ్‌లోని జంజెహ్లీలో ప్రారంభమైన మొట్టమొదటి MTB హిమాచల్ సైక్లింగ్ ఫెస్టివల్.. పోటీల్లో 10 ఏళ్ల నుంచి 64 ఏళ్ల రైడర్లు.. 

MTB Himachal Janjehli 2022 1st Edition: Mountain biking race flagged-off on Olympic Day

ఒలింపిక్ డేని పురుష్కరించుకుని జూన్ 23న మొట్టమొదటి MTB హిమాచల్ సైక్లింగ్ ఫెస్టివల్ ఘనంగా ఆరంభమైంది. హిమాచల్ ప్రదేశ్‌లోని జంజెహ్లీలో ఆరంభమైన ఈ మౌంటెన్ సైక్లింగ్, మూడు రోజుల పాటు సాగి జూన్ 26న మసోబ్రాలో ముగియనుంది. హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హిమాచల్ టూరిజం శాఖలతో కలిసి హస్త్‌పా (HASTPA) ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ మెగా మౌంటెన్ సైక్లింగ్ ఫెస్టివల్ ప్రారంభమైంది...

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ రామ్ సుభాంగ్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరై, మౌంటెన్ సైక్లింగ్ ఫెస్టివల్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ మౌంటెన్ సైక్లింగ్ ఫెస్టివల్‌లో 60 మంది రైడర్లు పాల్గొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యాన్ని పెంచుతున్న ఇంధన వాహనాల వినియోగాన్ని తగ్గించి, సైక్లింగ్‌పై ఆసక్తి రేకెత్తించే ఉద్దేశంతో ఈ మెగా సైక్లింగ్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నట్టు తెలియచేసింది హస్త్‌పా ఆర్గనైజేషన్...

ఈ మౌంటెన్ సైక్లింగ్ ఫెస్టివల్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లా, సోలన్, బిస్లాపూర్, కంగ్రా, మనది, కులుతో పాటు ఉత్తరాఖండ్, హర్యానా, మధ్య ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, చంఢీఘర్, జమ్మూ & కశ్మీర్ వంటి 8 రాష్ట్రాల నుంచి సైకిలిస్టులు పాల్గొంటున్నారు. వీరిలో ఢిల్లీ పోలీసులు, భారత మిలటరీ అకాడమీతో, ఉత్తరాఖండ్ టీమ్‌లో సభ్యులు కూడా ఉన్నారు...

మధ్యప్రదేశ్‌ చెందిన స్టేట్ అండ్ నేషనల్ సైక్లింగ్ ఛాంపియన్ పృథ్వీ రాజ్‌ సింగ్ రాథోడ్ కూడా MTB హిమాచల్ సైక్లింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ పోటీల్లో 10 ఏళ్ల కౌస్తవ్, 13 ఏళ్ల శాంభవి (అక్కాతమ్ముళ్లు) కూడా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా 64 ఏళ్ల మహేశ్వర్ దత్, ఈ మౌంటెన్ సైక్లింగ్ ఫెస్టివల్‌లో పాల్గొంటున్నాడు. 1977 నుంచి సైక్లింగ్ చేస్తున్న మహేశ్వర్ దత్, పర్యావరణానికి మనకున్న బంధాన్ని మానసికంగా, శారీరకంగా కలిపే అనుసంధానంగా మౌంటెన్ సైక్లింగ్‌ని చూస్తున్నానని తెలిపాడు...
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios