Asianet News TeluguAsianet News Telugu

ఈ వయసులో ధోనీ క్రికెట్ ఆడటం కష్టం..గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని ధోని తన రిటైర్మెంట్‌లో భాగంగానే భారత జట్టుకు దూరమయ్యాడనే వార్తలు వచ్చాయి. అదే సమయంలో దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సైతం ధోని ఎంపిక చేయకపోవడం ఇందుకు మరింత బలాన్ని ఇచ్చింది. అదంతా నిజం కాదని ఎమ్మెస్కే కూడా వివరణ ఇచ్చారు. కాగా... ఈ విషయంపై తాజాగా సునీల్ గవాస్కర్ ధోనీపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
 
MS Dhoni should go without being pushed out: Sunil Gavaskar
Author
Hyderabad, First Published Sep 20, 2019, 1:09 PM IST

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ధోనీ ఈ వయసులో క్రికెట్ ఆడలేరని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడుతున్నారు. గత కొంతకాలంగా ధోనీ రిటైర్మెంట్ పై కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని ధోని తన రిటైర్మెంట్‌లో భాగంగానే భారత జట్టుకు దూరమయ్యాడనే వార్తలు వచ్చాయి. అదే సమయంలో దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సైతం ధోని ఎంపిక చేయకపోవడం ఇందుకు మరింత బలాన్ని ఇచ్చింది. అదంతా నిజం కాదని ఎమ్మెస్కే కూడా వివరణ ఇచ్చారు. కాగా... ఈ విషయంపై తాజాగా సునీల్ గవాస్కర్ ధోనీపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

‘ప్రస్తుతం ధోని 38 ఏళ్ల వయసులో ఉన్నాడు. దాంతో భారత క్రికెట్‌ మేనేజ్‌మెంట్‌  కచ్చితంగా అతని నిర్ణయం కోసం వేచి చూస్తూ ఉంటుంది. వచ్చే టీ20 వరల్డ్‌కప్‌ నాటికి ధోనికి 39 ఏళ్లకు చేరతాడు. ఈ వయసులో క‍్రికెట్‌ ఆడటం చాలా కష్టం. అసలు ధోని మనసులో  ఏముందో ఎవరికీ తెలియదు. కేవలం అతను మాత్రమే తన క్రికెట్‌ కెరీర్‌ గురించి చెప్పగలడు. ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగత జీవితం అనేది ఒకటి ఉంటుంది. అదే వేరే విషయం.  నేను కూడా ధోని అత్యంత గౌరవం ఇస్తాను.. ధోనికి లక్షల  సంఖ్యలో ఎలా అయితే అభిమానులు ఉన్నారో, నేను అందులో ఒకడ్ని. ధోనిపై గౌరవంతో చెబుతున్నా. ధోనికి ఉద్వాసన చెప్పే సమయం కోసం వేచి చూడకుండా అతనే గౌరవంగా వీడ్కోలు చెబితే బాగుంటుంది. ధోని రిటైర్మెంట్‌కు విలువ దక్కాలంటే అతనే తొందరగా నిర్ణయం తీసుకోవాలి’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios