టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి... ఆల్ టైం టీ 20 క్రికెట్ టీంలో చోటు దక్కలేదు. కాగా... మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చోటు దక్కడం విశేషం. ఇంతకీ ఈ జట్టు ప్రకటించింది ఎవరో తెలుసా..? ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్ మెన్ డీన్ జోన్స్.

డీన్ జోన్స్ తాజాగా ఆల్ టైమ్ టీ 20 జట్టును ప్రకటించారు. ఆయన ప్రకటించిన జట్టులోని చాలా మంది సభ్యులు టీ 20 లు ఆడకపోవడం గమనార్హం. అయితే... వారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగలరని.. అందుకే తన జట్టులో చోటు కల్పిస్తున్నట్లు డీన్ జోన్స్ వివరణ ఇచ్చారు.

తన జట్టులో ఓపెనర్లుగా ఆసీస్ ఆటగాడు మాథ్యూ హెడేన్, విండీస్ గోర్డాన్ గ్రీనిడ్జ్ ను ఎంపిక చేశారు. వెస్టిండీస్ దిగ్గజం సర్ వివ్ రిచర్డ్స్ కు బ్యాటింగ్ ఆర్డర్ లో మూడో స్థానాన్ని కేటాయించారు. భారత్ నుంచి టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మాత్రమే జట్టులో చోటు కల్పించారు. ఈ జాబితాలో కోహ్లీ పేరు లేకపోవడం చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

డీమ్ జోన్స్ డ్రీమ్ టీ 20 జట్టు... మాథ్యూ హెడేన్, గోర్డన్ గ్రీనిడ్జ్, సర్ వివ్ రిచర్డ్స్, బ్రియన్ లారా, మార్టిన్ క్రో, ఇయాన్ బోథమ్, మహేంద్ర సింగ్ ధోనీ, షేన్ వార్న్, వసీం అక్రమ్, కర్ట్ లీ ఆంబ్రోస్, జోయోల్ గార్నర్.