చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీని బయపెట్టాడట. ఈ విషయాన్ని కోహ్లీనే స్వయంగా వెల్లడించాడు. ఇంతకీ మ్యాటరేంటంటే... ఆదివారం ఆదివారం చిన్నస్వామి మైదానం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడింది. కాగా.. కోహ్లీ అదృష్టం కొద్దీ.. ఈ మ్యాచ్ బెంగళూరు కైవసం అయ్యింది.

ఈ మ్యాచ్ లో విజయం తర్వాత కోహ్లీ మీడియాతో మాట్లాడారు. ‘‘‘‘ఈ మ్యాచ్‌ ఉద్వేగంతో కూడుకున్నది. ఎందుకంటే మేము కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ ఇది. అయితే, 19వ ఓవర్‌ వరకూ మ్యాచ్‌పై పట్టు ఉందనిపించింది. ఆఖరు ఓవర్‌లో ధోనీ బ్యాటింగ్‌తో మమ్మల్ని భయపెట్టాడు. మహీ తన ఐపీఎల్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడాడు. చివరి బంతికి నేను కోరుకున్నదే జరిగింది. స్వల్ప తేడాతో విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది’’ అని కోహ్లీ తెలిపాడు.