ఆస్ట్రేలియా 450/2, భారత్ ఆల్ అవుట్ : మిచెల్ మార్ష్ ప్రపంచకప్ ఫైనల్ అంచనా వైరల్‌...

మేలో వరల్డ్ కప్ పై మిచెల్ మార్ష్ ఓ పోడ్ కాస్ట్ లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చివరికి టైటిల్‌ కొట్టేది తామేనని భారత్ చిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పాడు. 

Mitchell Marsh's World Cup Final Prediction Goes Viral - bsb

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగే క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానుల్లో ఈ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను నెలకొల్పింది. సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 70 పరుగుల విజయంతో సహా ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో అన్నింటినీ గెలిచిన భారత్ టోర్నమెంట్‌లో అజేయంగా ఉంది. మరోవైపు గ్రూప్ దశలో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఆస్ట్రేలియా తమ అదృష్టాన్ని మార్చుకుంది. 

పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని జట్టు గురువారం జరిగిన రెండవ సెమీ-ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి, రోహిత్ శర్మ సైన్యంతో చివరిపోరుకు సిద్ధమయ్యింది. ఈ సమయంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గతంలో చేసిన ఓ కామెంట్ వైరల్ అవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ తన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుందని, భారత్‌ను వారి గడ్డపై ఓడిస్తుందని జోస్యం చెప్పాడు.

ప్రపంచ కప్ 2023 : కప్పుకొట్టడం కాదు, బంతిని పిచ్చకొట్టుడు కొట్టండి.. టీమిండియాకు సద్గురు సలహా..

ఫైనల్‌లో ఆస్ట్రేలియా 450/2 స్కోరు చేస్తుందని, భారత్‌ను 65 పరుగులకే ఆలౌట్ చేసి టైటిల్‌ను ఎగరేసేకు పోతుందని మార్ష్ వింత జోస్యం చెప్పాడు. ప్రోటీస్‌పై గట్టిపోటీతో గెలిచిన ఆస్ట్రేలియా ఫైనల్‌లోకి ప్రవేశించడంతో, మార్ష్ జోస్యం ఇప్పుడు వైరల్‌గా మారింది.

"ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా 450/2, భారత్ 65 ఆలౌట్" అని మార్ష్ మే 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ పోడ్‌కాస్ట్‌లో చెప్పాడు. భారత్ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తరువాతి నుంచి అంతర్జాతీయ టైటిల్ దక్కించుకోలేదు. దీంతో ఈ సారి మ్యాచ్ పై 1.4 బిలియన్ల జనాభా కలిగిన క్రికెట్-క్రేజీ దేశంలో అంచనాల ఫీవర్ పీక్ కు చేరుకున్నాయి.

వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టుతో ఆతిథ్య జట్టు ఎనిమిదో ప్రపంచకప్ ఫైనల్‌లో ఆడనుంది. నాలుగు వారాల క్రితం చెన్నైలో జరిగిన గ్రూప్ దశలో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఆ మ్యాచ్ లోపాట్ కమిన్స్ జట్టు 199 పరుగులకే ఆలౌటైంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios