టెన్షన్ టెన్షన్.. మెక్సికో విన్

Mexico beat South Korea
Highlights

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జావెయిర్ హెర్నాండెజ్

హైదరాబాద్: దక్షిణ కొరియాపై మెక్సికో 2-1 తేడాతో గెలిచింది. గ్రూప్-ఎఫ్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. తాజా విజయంతో అదే గ్రూప్‌లో రెండు విజయాలను నమోదు చేసుకున్న మెక్సికో నాకౌట్‌కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా జావెయిర్ హెర్నాండెజ్ నిలిచాడు.


ఆట ఆరంభమైనప్పటి నుంచి దక్షిణ కొరియా పోరాటపటిమను ప్రదర్శించింది. మెక్సికో రెండు గోల్స్ చేసినప్పటికీ చివర్లో ఆ జట్టుపై ఒక గోల్ సాధించింది. పోరాడి ఓడింది. 
ఫస్టాఫ్ 26వ నిముషంలో మెక్సికో మిడ్ ఫీల్డర్ కార్లోస్ వేల పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచి తొలి ఆధిక్యతను సంపాదించి పెట్టాడు. 


కొరియా ప్లేయర్ ఛౌ చేసిన తప్పిదానికి మెక్సికో పెనాల్టీ కిక్ దక్కించుకుంది. కార్లోస్ చేసిన అద్భుతమైన గోల్ మెక్సికో జట్టుకు 1-0 ఆధిక్యతను సంపాదించి పెట్టింది. సెకాండఫ్ 66వ నిముషంలో స్ట్రయికర్ జావెయిర్ హెర్నాండెజ్ బాల్‌తో చేసిన అద్భుత విన్యాసం మెక్సికో ఆధిక్యతను 2-0 కు చేర్చింది. ఇంజూరీ టైమ్‌లో దక్షిణ కొరియా స్ట్రయికర్ హుయాంగ్ మిన్ మెక్సికో డిఫెండర్లను తోసి రాజని చేసిన అద్భుతమైన గోల్ మెక్సికో ఆధిక్యతను 2-1కు పరిమితం చేసింది. మెక్సికోను నాకౌట్ దశకు చేర్చింది.

loader