Asianet News TeluguAsianet News Telugu

చరిత్ర సృష్టించిన మానికా బత్రా... ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో కాంస్యం కైవసం...

ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో కాంస్య పతకం గెలిచిన మానికా బత్రా... మొట్టమొదటి భారత మహిళా షట్లర్‌గా రికార్డు... 

Manika Batra creates history in Asian Cup Table Tennis Tennis tournament
Author
First Published Nov 19, 2022, 4:06 PM IST

భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మానికా బత్రా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. కామన్వెల్త్ గేమ్స్ 2022 టోర్నీలో తీవ్రంగా నిరాశపరిచిన మానికా బత్రా... ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో కాంస్య పతకం గెలిచింది. వరల్డ్ బెస్ట్ ర్యాంకర్లను మట్టికరిపిస్తూ సెమీ ఫైనల్ చేరిన భారత టీటీ సంచలనం మానికా.. సెమీ ఫైనల్‌లో వరల్డ్ ఐదో ర్యాంకర్, డిఫెండింగ్ ఛాంపియన్, జపాన్ క్రీడాకారిణి మిమా లిటో చేతుల్లో 2-4 తేడాతో ఓడిపోయింది...

సెమీస్‌లో ఓడిన మానికా బత్రా, కాంస్య పతక పోరులో సంచలన విజయం నమోదు చేసింది. వరల్డ్ 6వ ర్యాంకర్ టీటీ ప్లేయర్, జపాన్ క్రీడాకారిణి హినా హయటాతో జరిగిన మ్యాచ్‌లో 4-2 తేడాతో గెలిచింది మానికా బత్రా. ఏషియన్ కప్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో పతకం గెలిచిన మొట్టమొదటి భారత మహిళా టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర లిఖించింది మానికా బత్రా...

ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టోర్నీల్లో మహిళల సింగిల్స్ విభాగంలో ఇప్పటిదాకా చైనా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, హంగ్ కాంగ్, జపాన్ వంటి దేశాలు మాత్రమే పతకాలు గెలుస్తూ వచ్చాయి. టీమిండియా తరుపున పతకం గెలిచిన మొట్టమొదటి టీటీ వుమెన్స్ ప్లేయర్‌గా నిలిచింది మానికా బత్రా...

ఓవరాల్‌గా మాత్రం పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి టీటీ ప్లేయర్ ఛేతన్ బబూర్ ఓ రజతం (1997లో), ఓ కాంస్యం (2000వ సంవత్సరంలో) పతకాలు సాధించాడు. మొత్తంగా ఆసియా కప్ టేబుల్ టెన్నిస్‌లో చైనా 125 పతకాలు సాధిస్తే, హంగ్‌కాంగ్ 20, జపాన్ 19, దక్షిణ కొరియా 18, సింగపూర్ 16, ఉత్తర కొరియా 10, చైనీస్ తైపాయ్ 4 పతకాలు సాధించాయి. మానికా బత్రా కాంస్యంతో టీమిండియా పతకాల సంఖ్య మూడుకి చేరింది...

ఈ ఏడాది తీవ్రంగా నిరాశపరుస్తూ వివాదాలను ఎదుర్కొంటూ వచ్చిన మానికా బత్రాకి ఇది చాలా పెద్ద ఊరటనిచ్చే విజయం. 2020 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు, ఓ కాంస్య, ఓ రజత పతకం గెలిచిన మానికా బత్రా, టోక్యో ఒలింపిక్స్‌ 2022 పోటీల్లో మూడో రౌండ్‌లోకి ప్రవేశించి చరిత్ర క్రియేట్ చేసింది. మూడో రౌండ్‌లో ఓడిన తర్వాత కోచ్ సౌమ్యదీప్ రాయ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది మానికా బత్రా...

టీటీలో పోటీపడిన మిగిలిన ప్లేయర్లు టైమ్ అవుట్‌లో కోచ్‌ల విలువైన సలహాలు, సూచనలు తీసుకుంటుంటే... మానికా బత్రా మాత్రం ఒంటరిగా పోరాడింది. బ్రేక్ సమయంలోనూ ఆమె ఒంటరిగా కనిపించింది. ఒలింపిక్స్‌లో పాల్గొన్న మరో భారత టీటీ ప్లేయర్ సుత్రీతా ముఖర్జీ, సౌమ్యదీప్ రాయ్ అకాడమీలో శిక్షణ పొందింది...

 నేషనల్ గేమ్స్‌లో సుత్రీతా ముఖర్జీ, మానికా బత్రాని ఓడించింది. దీంతో సౌమ్యదీప్ రాయ్‌ని సుత్రీతా పర్సనల్ కోచ్‌గా పేర్కొంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి క్రమశిక్షణా రాహిత్య చర్యలు కూడా ఫేస్ చేసింది మానికా బత్రా... అంతేకాకుండా సుత్రీతా కోసం ఒలింపిక్ క్వాలిఫైయర్స్‌లో ఓడిపోవాల్సిందిగా సౌమ్యదీప్ రాయ్ ఒత్తిడి చేసినట్టు కూడా సంచలన ఆరోపణలు చేసింది మానికా బత్రా...

Follow Us:
Download App:
  • android
  • ios