హైదరాబాద్: శుక్రవారంనాటి ప్రదర్శనతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రషీద్ ఖాన్ కు అభిమానులు పెరుగుతున్నారు. సెలిబ్రిటీలు కూడా ఆయన ఫ్యాన్స్ గా మారిపోతున్నారు. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు రషీద్ ఖాన్ ఆటకు ఫిదా అయ్యారు.
 
రషీద్ ఖాన్ ను ప్రశంసిస్తూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు. దానికి రషీద్ ఖాన్ రిప్లై ఇచ్చాడు. `హ్యాట్సాఫ్ ర‌షీద్ ఖాన్‌. అద్భుత‌మైన మ్యాచ్‌. ఆదివారం వ‌ర‌కు ఆగ‌లేక‌పోతున్నా. స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టుకు నా అభినంద‌న‌లు. గో ఆరెంజ్ ఆర్మీ.. ఎస్ఆర్‌హెచ్‌` అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు. 

మ‌హేష్ బాబు చేసిన ఈ ట్వీట్‌కు ర‌షీద్ ఖాన్ స్పందించాడు. `ధ‌న్య‌వాదాలు బ్ర‌ద‌ర్. మీ సినిమాలన్నీ చూస్తున్నాను` అని ర‌షీద్ జవాబిచ్చాడు.