‘రిటైర్మెంట్ ప్రకటన చాలా త్వరగా చేశా.. రిగ్రెట్ అవుతున్నా..’ : సానియా మీర్జా
నేను ఆ ప్రకటన చాలా త్వరగా చేశానని అనుకుంటున్నాను. దానికి నేను ప్రస్తుతం పశ్చాత్తాపపడుతున్నాను.ఇప్పుడు అందరూ నన్ను దాని గురించే అడుగుతున్నారు’ అని సానియా మీర్జా అన్నారు. ఇదే లాస్ట్ సీజన్ అని ప్రకటించిన క్రమంలో ఈ టూర్, ఆట టెన్నిస్ పట్ల.. టూర్ విషయంలో ఆమె దృక్పథాన్ని మార్చిందా.. అని అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా స్పందించారు.
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి, హైదరాబాదీ Sania Mirza ఇటీవల తాను రిటైర్ కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 2022 సీజన్ తనకు చివరి సీజన్ అని ఇటీవల ప్రకటించి అభిమానుల్ని షాక్ కు గురిచేసింది. అయితే ఈ Retirement ప్రకటన తను చాలా త్వరగా చేశానని.. దీని గురించి అందరూ అడుగుతున్న క్రమంలో "regretting" అని చెప్పుకొచ్చింది.
Australian Openలో మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో మీర్జా స్వాన్‌సాంగ్ ప్రదర్శన స్థానిక జంట జైమీ ఫోర్లిస్, జాసన్ కుబ్లెర్‌తో క్వార్టర్ ఫైనల్ లో ఓటమితో ముగిసింది. "నేను ప్రతి మ్యాచ్‌లోనూ నిజాయితీ ఆడతాను. నా రిటైర్మెంట్ ప్రకటననూ అంతే నిజాయితీగా చెప్పాను. అయితే నేను ఆ ప్రకటన చాలా త్వరగా చేశానని అనుకుంటున్నాను. దానికి నేను ప్రస్తుతం పశ్చాత్తాపపడుతున్నాను.ఇప్పుడు అందరూ నన్ను దాని గురించే అడుగుతున్నారు’ అని సానియా మీర్జా అన్నారు. ఇదే లాస్ట్ సీజన్ అని ప్రకటించిన క్రమంలో ఈ టూర్, ఆట టెన్నిస్ పట్ల.. టూర్ విషయంలో ఆమె దృక్పథాన్ని మార్చిందా.. అని అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా స్పందించారు.
మూడు మిక్స్‌డ్ డబుల్స్ ట్రోఫీలతో సహా ఆరు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న భారతదేశపు most accomplished మహిళా టెన్నిస్ క్రీడాకారిణి అయిన 35 ఏళ్ల సానియా.. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో "ఎక్స్‌ట్రా సర్వ్"లో మాట్లాడుతూ...మ్యాచ్‌లు గెలవడానికే తాను టెన్నిస్ ఆడతానని చెప్పింది ఈ హైదరాబాదీ ప్లేయర్.
"నేను ఆడే ప్రతీ మ్యాచ్ లోనూ గెలవాలనే నేను టెన్నిస్ ఆడతాను. బరిలోకి దిగితే గెలుపే లక్ష్యంగా పోరాడతాను. అందుకే ఆడే ప్రతీ మ్యాచ్ లో నాదే విజయం కావాలని ప్రయత్నిస్తానే. కాబట్టి రిటైర్మెంట్ అనేది నా మనసులో ఎప్పుడూ ఉండే విషయం కాదు.
"నేను టెన్నిస్ ఆడడంతో ఆనందాన్ని పొందుతాను. అది నాకెప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది. ఆటలో గెలిచినా.. ఓడిపోయినా నేనెప్పుడూ ఆటను ఎంజాయ్ చేస్తాను. నా దృక్పథం ఎప్పటికీ అదే. ఆటలో ఎప్పుడూ నేను నా హాండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను. కొన్నిసార్లు అది పని చేస్తుంది, కొన్నిసార్లు పని చేయదు. ఇప్పటికీ నేను ఇలాగే ఉన్నాను. అయితే ఇప్పుడింకా సంవత్సరం ఆరంభంలోనే ఉన్నాం.. సంవత్సరాంతానికి ఏం జరగబోతోందో నేను ఆలోచించదలుచుకోలేదు’’ అని మీర్జా వివరించారు.
రామ్ తో కలిసి ఆడిన గేమ్ మీద మాట్లాడుతూ ఇది తమ మ్యాచ్‌లలో అత్యుత్తమైనది కాదని సానియా చెప్పింది. అప్పుడప్పుడూ అలా జరుగుతుంది. ఒక్కోసారి మీ రోజు బాగుండకపోవచ్చు. అది గ్రాండ్ స్లామ్ లో జరగడం దురదృష్టకరం... అని చెప్పుకొచ్చారు.
"మేమిద్దరం చివరి వరకు ఇద్దరం కలిసి స్ట్రింగ్ చేయలేకపోయాం. కాకపోతే చివరికి, మేం రెండవ సెట్‌లో ఉన్నాం, కానీ మేము మా అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. కనీసం నేనైనా బాగా ఆడుండాల్సింది. అది అలా జరిగిపోయిందంతే.. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది”అని మీర్జా అన్నారు
2022 సీజనే తనకు చివరిదని జనవరి 19న మీర్జా ప్రకటించింది. రోజురోజుకూ ఒంట్లో శక్తి సన్నగిల్లుతోంది. టెన్నిస్ కోసం రోజువారీ చేయాల్సిన సాధనకు ప్రేరణ, శక్తి ఇకపై ఒకేలా ఉండబోవు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ మొదటి రౌండ్‌లో నదియా కిచెనోక్ భాగస్వామ్యంతో ఆడి ఓడిపోయిన తర్వాత ఆమె రిటైర్మెంట్ ప్రకటన చేసింది. వీరి జంట స్లోవేనియాకు చెందిన తమరా జిదాన్సెక్, కాజా జువాన్ చేతిలో ఓడిపోయారు.