ధోనీ అంటే ఇంత పిచ్చా (వీడియో)

Look at that guy Reactions after got bless from Dhoni
Highlights

ధోనీ అంటే ఇంత పిచ్చా (వీడియో)

ధోనీ పేరు వింటేనే అభిమానుల్లో ఎక్కడా లేని జోష్‌ పుడుతుంది.. ఇప్పటి వరకూ ఏ భారత జట్టు సారథికి సాధ్యం కాని విధంగా రెండు ప్రపంచకప్‌లు, ఛాంపియన్స్‌ ట్రోఫీ అందించిన ఘనత కేవలం ధోనీకి మాత్రమే దక్కింది.‌  అయితే ముందుగా చెన్నై బ్యాటింగ్‌ చేస్తుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌ సురేశ్‌ రైనా ఔట్‌  అయిన అనంతరం ధోనీ బ్యాటింగ్‌కు వెళ్తున్నాడు. ఆ క్రమంలో సీఎస్‌కే అభిమాని అక్కడి సిబ్బందిని సైతం నెట్టుకొని వచ్చి మరీ ధోనీ పాదాలపై పడ్డాడు. అంతటితో ఆగకుండా ఉద్వేగంతో ధోనీని హత్తుకొని ఆనందంతో పొంగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌ అయింది.

loader