పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాదులకు ముఖ్యంగా పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం నేర్పాలని దేశప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తమ సహచరుల ప్రాణత్యాగానికి బదులు తీర్చుకోవాలని సైన్యం ప్రతీకారంతో రగిలిపోతోంది.

ఈ క్రమంలో పుల్వామా ఘటనపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ కూడా యుద్ధం చేయాల్సిందేనని పేర్కొన్నాడు. ‘‘పాకిస్తాన్‌తోనూ, వేర్పాటు వాదులతోనూ చర్చించాలని, కాకపోతే అది యుద్ధభూమి కావాలని ఘాటుగా ట్వీట్ చేశాడు.

ఇప్పటి వరకు జరిగింది చాలని, ఇక యుద్ధంతోనే బుద్ధి చెప్పాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. మరోవైపు గంభీర్‌తో పాటు పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.

సమకాలీన రాజకీయాలపై సోషల్ మీడియాలో స్పందిస్తూ తమ అభిప్రాయాలను తెలియజేస్తుంటారు. తాజాగా పుల్వామా ఘటనపై గంభీర్ చేసిన ట్వీట్‌కు స్పందించాల్సిందిగా అఫ్రిదిని పాక్ మీడియా ప్రశ్నించగా.. అతడికేమైంది అంటూ ప్రశ్నించాడు. 

Scroll to load tweet…