Asianet News TeluguAsianet News Telugu

Koneru Humpy : కోవాగ్జిన్ టీకా తీసుకోవడంతో... ప్రపంచ మహిళల టీం చెస్ చాంపియన్షిప్ కు హంపీకి నో ఎంట్రీ...!

ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ హంపి  భారత్లో తయారైన కోవాగ్జిన్‌ టీకా తీసుకుంది.  కానీ దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తింపు లేదు.  దీనివల్ల ఆమె స్పెయిన్‌ వెళ్లాలనుకుంటే మునుపటిలాగే కరోనా ప్రోటోకాల్ పాటించాలి. పది రోజుల పాటు క్వారంటైన్ లో గడపాలి.

Koneru Humpy's return to offline chess curtailed due to Covaxin restrictions
Author
Hyderabad, First Published Sep 30, 2021, 10:33 AM IST

భారత మహిళల చెస్ నెంబర్ వన్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోనేరు హంపి (Koneru Humpy)ప్రస్తుతం స్పెయిన్లో(Spain) జరుగుతున్న ప్రపంచ మహిళల టీం చెస్ చాంపియన్షిప్ (World Women's Team Chess Championship)కోసం బాగా సిద్ధమైంది. అందుబాటులో ఉన్న ఆన్లైన్ పోటీల్లో చురుగ్గా పోటీ పడింది. అయితే తీరా స్పెయిన్‌ ఈవెంట్‌ ఆడదాం అనుకుంటే ఆమె తీసుకున్న టీకా (Covaxin) వల్ల ఆంక్షలు ఎదురయ్యాయి.  

ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ హంపి  భారత్లో తయారైన కోవాగ్జిన్‌ టీకా తీసుకుంది.  కానీ దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తింపు లేదు.  దీనివల్ల ఆమె స్పెయిన్‌ వెళ్లాలనుకుంటే మునుపటిలాగే కరోనా ప్రోటోకాల్ పాటించాలి. పది రోజుల పాటు క్వారంటైన్ లో గడపాలి.

IPL 2021 RCB vs RR: బెంగళూరు ఘన విజయం.. రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి ఇక అస్సామే...!

ఈ విషయాలన్నీ హంపీకి స్పెయిన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తేనే తెలిసాయి. ‘నార్త్ మెసిడోనియా మీదుగా స్పెయిన్ వెళ్లాలనుకున్నా.  కానీ అక్కడ స్పెయిన్ మాదిరిగానే ఆంక్షలు ఉన్నాయి.  అక్కడా పది రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి వచ్చేది. ఆంక్షలు సడలించే అవకాశం ఉందేమోనని భారత చెస్‌ సమాఖ్య కూడా జోక్యం చేసుకుంది. కానీ వారి  ప్రయత్నం ఫలించలేదు’  అని హంపీ వివరించింది.

కోవాగ్జిన్‌పై ఉన్న ఆంక్షల వల్ల ఆమె ఓ మేటి ఈవెంట్లో పాల్గొనలేక పోయింది.  ఆమె స్థానం భర్తీ చేసేందుకు ఎంపిక చేసిన పద్మిని రౌత్ కు అదే సమస్య ఎదురైంది. కోవాగ్జిన్‌తో ఆమె కూడా స్పెయిన్ ప్రయాణం కాలేకపోయింది.  డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన కోవిషీల్డ్‌ను వేయించుకున్న వారికి 122 దేశాలు ఆంక్షలు సడలించాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios