Asianet News TeluguAsianet News Telugu

ఖేల్ రత్న రేసులో తెలుగు తేజాలు కిదాంబి శ్రీకాంత్, కోనేరు హంపి

ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న పురస్కారానికి తెలుగు తేజాలు కిదాంబి శ్రీకాంత్‌, బి. సాయి ప్రణీత్‌, కోనేరు హంపిలు నామినేట్‌ అయ్యారు. 

Koneru Hampi, Kidambi Srikanth's names proposed for Rajiv Gandhi Khel Ratna Award
Author
Hyderabad, First Published Jul 2, 2021, 8:54 AM IST

ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న పురస్కారానికి తెలుగు తేజాలు నామినేట్‌ అయ్యారు. అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు కిదాంబి శ్రీకాంత్‌, బి. సాయి ప్రణీత్‌ సహా చదరంగ మాంత్రికురాలు కోనేరు హంపిలు ఈ ఏడాది అత్యున్నత క్రీడా అవార్డు రేసులో నిలిచారు. 

ప్రపంచ నం.3 ర్యాంక్‌ కోనేరు హంపి వచ్చే ఏడాది జరుగనున్న మహిళల క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత సాధించింది. ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో హంపి కీలక సభ్యురాలు. 

అర్జున అవార్డు, పద్మ శ్రీ పురస్కారాలు అందుకున్న కోనేరు హంపి ఇప్పుడు రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న రేసులో ఉంది. ఏడుగురు చెస్‌ క్రీడాకారులు విదిత్‌ ఎస్‌ గుజరాతి, బి ఆదిబన్‌, ఎస్పీ సేతురామన్‌, ఎంఆర్‌ లలిత్‌ బాబు, భక్తి కులకర్ణి, పద్మణి రౌత్‌లను అర్జున అవార్డులకు ఆల్‌ ఇండియా చెస్‌ ఫెడరేషన్‌ ప్రతిపాదించింది. 

స్టార్‌ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌లను ఖేల్‌ రత్నకు సిఫారసు చేసిన భారత బ్యాడ్మింటన్‌ సంఘం... హెచ్‌.ఎస్‌ ప్రణయ్, ప్రణవ్‌ జెర్రీ, సమీర్‌ వర్మలను అర్జున అవార్డులకు ప్రతిపాదించింది.బాడ్మింటన్ సంఘం. 

ఇకపోతే సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, టీమిండియా మహిళల వన్డే, టెస్టు సారథి మిథాలీ రాజ్‌ పేర్లను బీసీసీఐ ఖేల్ రత్న పురస్కారానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. అర్జున అవార్డు కోసం శిఖర్‌ ధావన్‌, కేల్‌ రాహుల్‌, జస్ప్రీత్‌ బుమ్రా పేర్లను ప్రతిపాదించింది బీసీసీఐ. 

భారత రెజ్లింగ్‌ సమాఖ్య సైతం నలుగురి పేర్లను అర్జున పురస్కారాల కోసం సిఫారసు చేసింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచిన రవి దహియా, దీపక్‌ పునియా, అన్షు మలిక్‌, సరితను ఇందుకోసం ఎంపిక చేశారు. మరోవైపు అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య టీమ్‌ఇండియా సారథి సునిల్‌ ఛెత్రీ పేరును రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న కోసం సిఫార్సు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios