మైదానంలో క్రికెట్ సాధన చేస్తూ ఓ యువ క్రికెటర్ మృతి చెందాడు. ఓ స్పోర్ట్ క్లబ్ లో సాధన చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో సదరు క్రికెటర్ గ్రౌండ్‌లోనే కుప్పకూలి మృతిచెందాడు. ఈ విషాదం పశ్ఛిమ బెంగాల్ రాజధాని బెంగాల్ లో చోటుచేసుంది. 

కోల్ కతా కు చెందిన 21 ఏళ్ల అంకిత్ శర్మకు క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నాడు. ఎలాగైనా భారత జట్టులో స్థానం సంపాదించాలన్న ఆశయంతో క్రికెట్‌లో మెలకువలు నేర్చుకోడాని స్థానిక పైక్‌పారా స్పోర్ట్స్ క్లబ్ లో చేరాడు. క్రికెటర్ ఎదగాలన్న పట్టుదలతో అనుక్షణం కష్టపడుతూ తీవ్రంగా శ్రమించేవాడు. ఎప్పుడూ మైదానంలోనే వుంటూ తన ఆటతీరుకు మెరుగులు దిద్దేవాడు. 

ఇలా అంకిత్ రోజూ మాదిరిగా మంగళవారం ప్రాక్టిస్ చేయడానికి గ్రౌండ్ కు వెళ్లాడు. కోచ్ సూచనల మేరకు వార్మప్ చేస్తుండగా ఒక్కసారిగా చాతినొప్పితో కుప్పకూలాడు. దీంతో క్లబ్ సిబ్బంది, తోటి ఆటగాళ్లు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 

తమ రాష్ట్రానికి చెందిన యువ క్రికెటర్ మృతిపై క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌(క్యాబ్‌) సెక్రటరీ అవిషేక్‌ దాల్మియా విచానం వ్యక్తం చేశారు. అతడి మృతిపై సంతాపంగా ఇవాళ క్యాబ్ ఆద్వర్యంలో జరిగే మ్యాచ్ లు అన్నింటిన వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా ఓ యువ క్రికెటర్ ని కోల్పోవడం క్యాబ్ కే కాదు యావత్ భారత దేశానికి తీవ్ర లోటని అభిషేక్ పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు అతడు సానుభూతి ప్రకటించాడు.