నాటింగ్‌హామ్: ఇంగ్లండుతో జరుగతున్న మూడో టెస్టు మ్యాచు తొలి రోజు శనివారం భారత ఆటగాళ్లు చేతులకు నల్ల బ్యాండులతో బరిలోకి దిగారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి, మాజీ కెప్టెన్‌ అజిత్‌ వాడేకర్‌కు టీమిండియా నివాళిగా వారు ఆ బ్యాండ్లు ధరించారు. 

ఈనెల 15వ తేదీన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్‌ మరణించగా, గురువారం వాజ్‌పేయి అనారోగ్యంతో కన్నుమూశారు. ఇంగ్లండ్‌ గడ్డపై తొలిసారిగా వాడేకర్‌ నేతృత్వంలోనే భారత్‌ టెస్టు సిరీస్‌ విజయం అందుకుంది.

మాజీ ప్రధాని వాజ్ పేయి, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ ల గౌరవార్థం భారత క్రికెట్ జట్టు చేతులకో నల్ల బ్యాండ్లు ధరించారని బిసిసిఐ ట్వీట్ చేసింది.