న్యూఢిల్లీ: ఇటీవల తాను ఫెదరర్ ను కలిసి ఏం మాట్లాడాననే విషయాన్ని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. తన జివనసహచరి అనుష్కతో కలిసి కోహ్లీ ఇటీవల ఫెదరర్‌ను కలిసిన విషయం తెలిసిందే. తాను రోజర్ ఫెదరర్ తో కలిసినప్పుడు మాట్లాడిన విషయాలను ఆయన ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.

ఫెదరర్‌ను గతంలో చాలా సార్లు కలిశానని, తామిద్దరం సిడ్నీలో కొన్నేళ్ల క్రితం కలిశామని, ఆ విషయాన్ని ఆయనే చెప్పారని, అసలు ఆ విషయాన్ని ఫెదరర్‌ గుర్తుంచుకోవడమే గొప్ప విషయమని కోహ్లీ అన్నాడు. ఆ సందర్భాన్ని తాను మాటల్లో వర్ణించలేనని అన్నాడు. 


తాను చిన్నప్పటి నుంచి ఫెదరర్ ను చూస్తున్నట్లు కోహ్లీ తెలిపాడు. గొప్ప టెన్నిస్‌ క్రీడాకారుడే కాదు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి కూడా అని ఆయన ఫెదరర్ ను ప్రశంసించాడు. తమ ఇద్దరి భేటీ సందర్భంగా ఆయన ప్రశ్నలు వేస్తుంటే తనకు చాలా సంతోషం వేసిందని చెప్పాడు. ఆటకు ఎలా సిద్ధమవుతారు, ఆట గురించి ఏం ఆలోచిస్తారు వంటి ప్రశ్నలు వేసినట్లు తెలిపాడు.