Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ నెంబర్ వన్‌కు చేరువలో కోహ్లీ...దిగ్గజ క్రికెటర్ రిచర్డ్స్ రికార్డు బద్దలు

టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డును బద్దలుగొట్టాడు. భారత జట్టుకు అత్యధిక వన్డే విజయాలు అందించి కెప్టెన్‌గా ఇప్పటికే రికార్డు సృష్టించిన కోహ్లీ న్యూజిలాండ్ వన్డే ద్వారా మరో అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ దిగ్గజాల్లో ఒకడైన విండీస్ మాజీ కెప్టెన్ వివ్ రిచర్డ్స్ పేరిట వున్న రికార్డును తాజా విజయం ద్వారా కోహ్లీ బద్దలుగొట్టాడు. 

kohli near world record as a captain
Author
Mount Maunganui, First Published Jan 28, 2019, 6:56 PM IST

టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డును బద్దలుగొట్టాడు. భారత జట్టుకు అత్యధిక వన్డే విజయాలు అందించి కెప్టెన్‌గా ఇప్పటికే రికార్డు సృష్టించిన కోహ్లీ న్యూజిలాండ్ వన్డే ద్వారా మరో అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ దిగ్గజాల్లో ఒకడైన విండీస్ మాజీ కెప్టెన్ వివ్ రిచర్డ్స్ పేరిట వున్న రికార్డును తాజా విజయం ద్వారా కోహ్లీ బద్దలుగొట్టాడు. 

తాజా న్యూజిలాండ్‌ విజయంతో కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో 47వ వన్డే విజయం చేరింది. దీంతో ఇప్పటివరకు కెప్టెన్ గా 46 వన్డే విజయాలతో ప్రపంచ నంబర్ 2 స్థానంలో నిలిచిన విండీస్ మాజీ కెప్టెన్ వివ్ రిజర్డ్స్ తో పాటు దక్షిణాప్రికా మాజీ కెప్టెన్ హాన్సీ క్రోనేలను వెనక్కినెట్టాడు.  ఇలా ఒకేసారి ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల కెప్టెన్సీ రికార్డులను బద్దలుగొట్టి కోహ్లీ వారి స్థానాన్ని ఆక్రమించాడు. 

ఇక అత్యధిక వన్డే విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్, వెస్టిండిస్ మాజీ సారథి క్లైవ్ లాయిడ్ లు మొదటి స్థానంలో వున్నారు. వీరికి మరో మూడు వన్డేల దూరంలో కోహ్లీ నిలిచాడు. భారత జట్టు ఇదే జోరు కొనసాగిస్తే నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించడానికి కోహ్లీకి మరెంతో సమయం పట్టదు. 

మౌంట్ మాంగనూయి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 243 పరుగులు మాత్రమే చేయగల్గింది.  244 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాట్ మెన్స్ ని కివీస్ బౌలర్లు ఏ దశలోనూ అడ్డుకోలేక పోయారు. ఈ మ్యాచ్ లో చెలరేగి పోయిన ఓపెనర్ రోహిత్, కెప్టెన్ కోహ్లీ లు అర్థ శతకాలు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించారు.  ఇలా బ్యాట్ మెన్ గానే కాకుండా కెప్టెన్ గా కూడా కోహ్లీ రాణిస్తూ ప్రపంచ రికార్డులను ఒక్కోటిగా తన ఖాతాలో వేసుకుంటున్నాడు. 
  
Follow Us:
Download App:
  • android
  • ios