Junior World Wrestling Championship: జూనియర్ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన భార‌త‌ రెజ్ల‌ర్ మోహిత్ కుమార్.. అండ‌ర్-20 ప్ర‌పంచ ఛాంపియ‌న్ రెజ్ల‌ర్ గా నిలిచిచాడు. ఫైనల్లో మోహిత్ 0-6తో వెనుకంజలో ఉన్నప్పటికీ.. మొదటి విరామం తర్వాత వ్యక్తిగత అథ్లెట్ గా బరిలోకి దిగిన‌ రష్యన్ ఆటగాడు బౌట్ ముగిసే కొద్దీ వెనుకంజ వేయ‌డంతో భారత రెజ్ల‌ర్ వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించాడు. 

Mohit-Indian U20 World Champion wrestler: జూనియర్ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన భార‌త‌ రెజ్ల‌ర్ మోహిత్ కుమార్.. అండ‌ర్-20 ప్ర‌పంచ ఛాంపియ‌న్ రెజ్ల‌ర్ గా నిలిచిచాడు. ఫైనల్లో మోహిత్ 0-6తో వెనుకంజలో ఉన్నప్పటికీ వ్యక్తిగత అథ్లెట్ గా బరిలోకి దిగిన‌ రష్యన్ ఆటగాడు బౌట్ ముగిసే కొద్దీ వెనుకంజ వేయ‌డంతో భారత రెజ్ల‌ర్ వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించాడు.

వివ‌రాల్లోకెళ్తే.. 61 కేజీల ఫ్రీస్టైల్ వెయిట్ విభాగంలో ఫైనల్లో రష్యాకు చెందిన ఎల్దార్ అఖ్మదునినోవ్ ను ఓడించి 2019 తర్వాత జూనియర్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన తొలి భారత రెజ్లర్ గా మోహిత్ కుమార్ రికార్డు సృష్టించాడు. ఫైనల్లో మోహిత్ 0-6తో వెనుకంజలో ఉన్నప్పటికీ వ్యక్తిగత అథ్లెట్ గా బరిలోకి దిగిన రష్యన్ ఆటగాడు బౌట్ ముగిసే కొద్దీ త‌న పోరాట ప‌టిమ‌ను కోల్పోవడంతో భారత ఆటగాడు వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించాడు.

Scroll to load tweet…

ఇప్పుడు సీనియర్ సర్క్యూట్ లోకి మారిన దీపక్ పూనియా 2019లో ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్ గెలిచిన చివరి భారతీయుడు. అంతకు ముందు పల్వీందర్ చీమా (2001), రమేష్ కుమార్ (2001) ప్రపంచ జూనియర్ టైటిల్ ను కైవసం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ కిరీటాన్ని గెలుచుకున్న నాలుగో భారత రెజ్లర్ గా అమిత్ నిలిచాడు. మోహిత్ మొదటి పీరియడ్ ముగియడానికి ముందు భారీ తేడా పాయింట్ల‌తో వెనుకంజ‌లో ఉన్నాయి. అయితే, విరామం తర్వాత ఇది వన్ సైడ్ గేమ్ గా మారింది. మెడికల్ టైమ్ అవుట్ కోరిన తన ప్రత్యర్థిని కట్టడి చేయడానికి మోహిత్ త్వరగా పుష్ అవుట్ పాయింట్లు సాధించాడు. మోహిత్ దూకుడుగా ఆడటంతో ఎల్దార్ డిఫెన్స్ దెబ్బతింది. 

Scroll to load tweet…