నెరవేరిన కల..యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం
యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలనుకుంటున్న భారత్ కల నెరవేరింది. అర్జంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో జరుగుతున్న మూడవ యూత్ ఒలింపిక్స్‌లో 15 ఏళ్ల వెయిట్ లిఫ్టర్ జెరిమి లార్నింగా ఈ ఘనత సాధించాడు.
యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలనుకుంటున్న భారత్ కల నెరవేరింది. అర్జంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో జరుగుతున్న మూడవ యూత్ ఒలింపిక్స్‌లో 15 ఏళ్ల వెయిట్ లిఫ్టర్ జెరెమీ లార్నింగా ఈ ఘనత సాధించాడు.
పురుషుల 62 కిలోల ( ఎ ) విభాగంలో టర్కీకి చెందిన టోప్టాస్ కానర్, కొలంబియాకు చెందిన జోష్ మంజార్స్‌ను ఓడించి జెరెమీ గోల్డ్ మెడల్‌ను సాధించాడు. తొలుత స్నాచ్ విభాగంలో అత్యధికంగా 124 కేజీల బరువును సునాయాసంగా ఎత్తిన జెరెమీ.. క్లీన్ అండ్ జర్క్‌లో అత్యధికంగా 150 కేజీలను ఎత్తాడు.
అంతకు ముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో తుషార్ మనే, మెహులీ ఘోష్‌లు 44 కేజీల జూడోలో తబాబి దేవిలు రజత పతకం సాధించారు. దీంతో భారత్ ఖాతాలో ఒక గోల్డ్ మెడల్, మూడు రజత పతకాలు చేరాయి.. అంతకు ముందు 2014లో భారత్ కేవలం రెండు పతకాల్ని మాత్రమే సాధించింది.