మరో బాలీవుడ్ బామతో హార్థిక్ డేటింగ్

Is cricketer Hardik Pandya dating Esha Gupta?
Highlights

పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ.. ప్రచారం

టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ఓ బాలీవుడ్ నటితో డేటింగ్ ఉన్నాడంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కొన్నాళ్ల కిందట పాండ్యా బాలీవుడ్ భామ ఎల్లీ ఎవ్రామ్‌తో డేటింగ్‌‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరూ లంచ్, డిన్నర్లకు చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

గతేడాది డిసెంబరులో హార్దిక్‌ పాండ్యా సోదరుడు కృనాల్‌ పాండ్యా పెళ్లికి ఎల్లీ హాజరుకావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఆ తర్వాత కూడా వీరిద్దరూ అడపాదడపా బయట కనిపించారు. ఓ సారి ముంబై ఎయిర్‌పోర్టులో ఎల్లీ.. హార్దిక్‌ను డ్రాప్‌ చేసి వెళ్తున్న ఫొటోలో నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.

అయితే ఆ తర్వాత ఏమైందోగానీ.. ఇద్దరూ విడిపోయారు. తాజాగా హార్దిక్ పాండ్యా.. బాలీవుడ్ నటి ఇషా గుప్తాతో డేటింగ్ చేస్తున్నట్లు జాతీయ మీడియాకు చెందిన ఓ వెబ్‌సైట్ వెల్లడించింది. ఓ పార్టీలో ఈ ఇద్దరూ కలుసుకున్నారని, అప్పటి నుంచి వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారట.

ప్రస్తుతం ఒకరినొకరు అర్థం చేసుకొనే పనిలో ఉన్నారు. ఇద్దరూ కలిసి అభిమానులు, మీడియా కంట పడకుండా లంచ్‌, డిన్నర్లకు వెళ్లున్నారంట. అయితే, ఈ వార్తలపై ఇప్పటి వరకు అటు పాండ్యా.. ఇటు ఇషా కానీ ఎవరూ స్పందించలేదు. 

loader