ఐపిఎల్-11 బెట్టింగ్ కలకలం : ఇందులో మరింత మంది బాలీవుడ్ సెలబ్రిటీల పాత్ర

ipl season 11 betting case
Highlights

బెట్టింగులే కాదు, మ్యాచ్ ఫిక్సింగ్ లు కూడా

ఐపీఎల్-11 లో బెట్టింగ్ పాల్పడినట్లు సల్మాన్ ఖాన్ సోదరుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈయనతో పాటు మరికొంత మంది బాలీవుడ్ సెలబ్రిటీల హస్తం ఈ బెట్టింగ్ వ్యవహారంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా బుకీలతో సత్సంబంధాలు కలిగి ఉండి బెట్టింగ్ వ్యవహారాన్ని నడిపినట్లు థానే పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ బెట్టింగ్ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా అర్బాజ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ విచారణలో మరింత మంది బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు బైటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇక బెట్టింగ్ వ్యవహారంలో పట్టుబడి అర్బాజ్ పేరు బైటపెట్టిన బుకీ సోనూ జలాన్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బైటికివచ్చాయి. ఇతడు కేవలం ఐపిఎల్ మ్యాచుల్లోనే కాదు ఇంటర్నేషనల్ మ్యాచుల్లో కూడా బెట్టింగ్ పాల్పడినట్లు తెలుస్తోంది. పలు ఇంటర్నేషనల్ మ్యాచ్ లను ఫిక్స్ చేసినట్లు ఇతడు పోలీసుల విచారణలో బైటపెట్టినట్లు సమాచారం. 

ఈ ఐపీఎల్ లో ముంబై, పంజాబ్ ల మద్య జరిగిన ఓ మ్యాచ్ లో ఇతడు ఫిక్సింగ్ కు పాల్పడినట్లు సమాచారం. ఈ మ్యాచ్ లో ఇద్దరు ఆటగాళ్లను కొనుక్కుని ఫిక్సింగ్ చేసినట్లు, వీళ్ల ద్వారా బాల్ టు బాల్ బెట్టింగ్ కు పాల్పడి కోట్లల్లో సంపాదించాడు సోనూ. ఒక్క ఐపిఎల్ ఫైనల్ లోనే ఇతడు పది కోట్లు సంపాదించినట్లు సమాచారం.

సోనూ జలాన్ కు దుబాయ్ లోని దావూద్ బెట్టింగ్ ముఠాతో సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు. దావూద్ బెట్టింగ్ ముఠాలోని అనిత్ తుండా, రయీస్ పరూఖీ లతో ఇతడు టచ్ లో ఉన్నట్లు, దుబాయ్ లోని ఓ కార్పోరేట్ కార్యాలయం కేంద్రంగా బెట్టింగ్ లు, ఫిక్సింగ్ లకు పాల్పడేవారని తెలుస్తోంది. ఇలా వీరంతా కలిసి ఈ ఐపిఎల్ సీజన్ 11 లో మొత్తం వెయ్యి కోట్ల బెట్టింగ్ కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
 

loader