IPL New Teams Tender: 2022లో జరుగనున్న ఐపీఎల్ లో రెండు కొత్త జట్లు అరంగ్రేటం చేయనున్న విషయం తెలిసిందే. అందుకోసం వివిధ నగరాలు పోటీ పడుతున్నా.. రెండు నగరాలు మాత్రం కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తున్నది.
దాదాపు నెల రోజుల పాటు దుబాయ్ లో క్రికెట్ ప్రేమికులను అలరించిన ఐపీఎల్ (IPL-14) ముగిసినా అందుకు సంబంధించిన వార్తలు మాత్రం ఇంకా ఆసక్తి రేపుతున్నాయి. వచ్చే ఏడాది ఐపీఎల్ (IPL2022) లో రెండు కొత్త జట్లు రానుండటమే దీనికి కారణం. కొత్త జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈనెల 25న దుబాయ్ లో ప్రకటించనున్నది. ఇందుకోసం ఇప్పటికే భారీ వ్యాపారసంస్థలు, ప్రపంచంలోకి ప్రముఖ స్పోర్ట్స్ క్లబ్ లు బిడ్ లు దాఖలు చేశాయి.
అయితే ఫ్రాంచైజీలు, టెండర్ల విషయం కాస్త పక్కనబెడితే రెండు కొత్త నగరాలు ఏమై ఉంటాయా..? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఐపీఎల్ 2022లో పాల్గొనేందుకు ఇప్పటికే దేశంలోని ఆరు ప్రముఖ నగరాల నుంచి పలువురు వ్యాపారవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో.. ధర్మశాల, గువహతి, రాంచీ, లక్నో, అహ్మదాబాద్, కటక్ ఉన్నాయి. ఈ ఆరింటిలో రెండు నగరాల పేర్లను బీసీసీఐ కన్ఫర్మ్ చేసినట్టు బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్నది.
ఇది కూడా చదవండి:IPL New Teams: ఐపీఎల్ కొత్త ఫ్రాంచెైజీ కోసం ఆసక్తి చూపుతున్న బాలీవుడ్ హాట్ కపుల్..? ఓ భారీ వ్యాపారవేత్త అండ?
రెండింటిలో ఒకటి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), హోంమంత్రి అమిత్ షా (Amit shah) ల సొంత రాష్ట్రం గుజరాత్ (Gujarat) లోని అహ్మదాబాద్ (ahmedabad) కాగా.. రెండోది ఉత్తరప్రదేశ్ (UP) రాజధాని లక్నో (Lucknow). ఈ రెండు నగరాలు పోటీలో ముందువరుసలో ఉన్నాయని తెలుస్తున్నది. కాగా, అహ్మదాబాద్ ను మోదీ ఆప్త మిత్రుడుగా పేరున్న గౌతం అదానీ (adani) దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాడని సమాచారం. ఇందుకు సంబంధించి అదానీ గ్రూప్ ఇప్పటికే బిడ్ కూడా దాఖలు చేసింది. ఇక లక్నో నగరం తరఫున మరో బిగ్ కార్పొరేట్ బిడ్ వేశాడని తెలుస్తున్నది.
ఇది కూడా చదవండి: IPL New Teams Tender: ఐపీఎల్ పై కన్నేసిన మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్.. పోటీ పడుతున్న మరో 15 సంస్థలు..?
కొత్త ఐపీఎల్ జట్ల టెండర్లను ఎంచుకునే గడువు బుధవారంతోనే ముగిసింది. ఈనెల 25న.. అంటే 24న జరిగే హైఓల్టేజీ ఇండియా-పాకిస్తాన్ (India vs pakistan) మ్యాచ్ అనంతరం బీసీసీఐ కొత్త జట్ల పేర్లు, వివరాలు ప్రకటించనుంది. కొత్త ఫ్రాంచైజీలను దక్కించుకోవడానికి మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ఓనర్స్ గ్లేజర్ ఫ్యామిలీ (glazer family)తో పాటు మాజీ ఫార్ములా 1 భాగస్వాములు గా ఉన్న సీవీసీ పార్ట్నర్స్ (CVC Partners).. జిందాల్ స్టీల్ అండ్ పవర్ (Jindal steel and power) లు కూడా ఆసక్తి చూపిస్తున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇదిలాఉండగా ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీకి సంబంధించి మరో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నది. ప్రముఖ బాలీవుడ్ జంట రణ్వీర్-దీపికా పదుకునే (Ranveer singh deepika padukune) లు కూడా కొత్త టీమ్ ను దక్కించుకునే రేసులో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇండియాలోని ఓ ప్రముఖ వ్యాపారవేత్త వెనుకఉండి.. దీపికా-రణ్వీర్ లతో కొత్త ఫ్రాంచైజీ ని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాడని తెలుస్తున్నది. ఏదేమైనా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు సోమవారం వెల్లడి కానున్నాయి.
కాగా, ఐపీఎల్ లో కొత్త నగరాలను చేర్చడం ఇదే కొత్త కాదు. ఇంతకుముందు 2010లో బీసీసీఐ.. కొచ్చి టస్కర్స్ (కొచ్చి-కేరళ), పూణె వారియర్స్ (పూణె-మహారాష్ట్ర) కూడా ఐపీఎల్ ఆడాయి. కానీ తర్వాత పలు కారణాలతో అవి నిష్క్రమించాయి.
