ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. రేపటి నుంచి ఐపీఎల్ సీజన్ 12 ప్రారంభం కానుంది. దీంతో.. టికెట్ల అమ్మకాలు కూడా జోరందుకున్నాయి. ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ www.eventsnow.com ద్వారా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మ్యాచ్‌ల టిక్కెట్లు కొనుగోలు చేయడానికి అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. 

ఈనెల 29న ఉప్పల్‌ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌ ఆడే తొలి మ్యాచ్‌ టిక్కెట్లలో ఒక్క రూ.1,562ల శ్రేణివి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రూ.500, రూ.781, రూ.1,953 టిక్కెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. 

ఉప్పల్‌లోనే ఈనెల 31న బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌తో జరిగే మ్యాచ్‌ టిక్కెట్లలో రూ.1,171, రూ.3,125, రూ.5,468 శ్రేణివి అందుబాటులో ఉండగా రూ.500, రూ.781, రూ.1,367 టిక్కెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. ఇక, హైదరాబాద్‌లో ఎనిమిది టిక్కెట్‌ విక్రయ కేంద్రాలతో పాటు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారు అసలైన టిక్కెట్లు పొందేందుకు నాలుగు ప్రత్యేక అవుట్‌లెట్స్‌ను ఏర్పాటు చేశారు.

 జింఖానా గ్రౌండ్స్‌, అసెంబ్లీ మెట్రో స్టేషన్‌, సరూర్‌నగర్‌ స్టేడియం, గచ్చిబౌలి బీడబ్స్‌లో టిక్కెట్ల విక్రయ కేంద్రాలతో పాటు రిడెంప్షన్‌ అవుట్‌లెట్స్‌ను ఏర్పాటు చేయగా మియాపూర్‌, మూసాపేట్‌, నాగోల్‌, బేగంపేట మెట్రో స్టేషన్లలో విక్రయ కేంద్రాలను ప్రారంభించారు.